News August 19, 2025
HYD: KBR పార్క్ వద్ద పనులు పర్యవేక్షించిన మంత్రి

HYD KBR పార్క్ వద్ద నిలిచిన వరద నీటిని హైడ్రా తొలగించింది. మంత్రి పొన్నం ప్రభాకర్, GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈ పనులను పర్యవేక్షించారు. ఈ సమస్యను కౌన్సిల్‌లో పెట్టి పైపులైన్ల ఏర్పాటు పనులను మంజూరు చేయిస్తామని మంత్రి, మేయర్ అధికారులకు చెప్పారు. అప్పటి వరకు ఇక్కడ నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులకు సూచించారు.
Similar News
News March 5, 2026
బాపట్ల: ఇంటర్ పరీక్షలకు 191 మంది ఆబ్సెంట్

బాపట్ల జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా విద్యాశాఖ అధికారి జుబేర్ తెలిపారు. తొమ్మిదో రోజు పరీక్షకు మొత్తం 2,785 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 2,594 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. మిగిలిన 191 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
News March 5, 2026
మంచిర్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి: కలెక్టర్

మంచిర్యాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ‘పరిశుభ్రత – మన బాధ్యత’ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. 100 శాతం చెత్త సేకరణ చేస్తామని, ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా చెత్తబుట్టలనే వాడాలని సూచించారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేస్తామని, మున్సిపాలిటీకి ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, మేయర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
News March 5, 2026
క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

హకీంపేట, ఆదిలాబాద్, కరీంనగర్, హన్మకొండ స్పోర్ట్స్ స్కూళ్లలో 4వ తరగతి ప్రవేశాలకు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పోస్టర్ విడుదల చేశారు. ఎనిమిది నుంచి తొమ్మిదేళ్ల వయసున్న విద్యార్థులు ఈ నెల 12లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 13 నుంచి మండలస్థాయి, 28 నుంచి జిల్లా స్థాయి ఎంపికలు జరుగుతాయి. ఆసక్తిగల విద్యార్థులు http://tgss.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.


