News August 19, 2025
రెవిన్యూ అధికారులు నిబద్ధతతో పనిచేయండి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన విజ్ఞప్తులు, భూముల రీ సర్వే, భూ వివాదాల పరిష్కారం, రికార్డుల అప్డేషన్ వంటి రెవెన్యూ అంశాల్లో కీలక పాత్ర పోషించి నిబద్ధతతో పనిచేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాజంపేటలో రెవెన్యూ పరిపాలనలో పారదర్శకత, సమయపాలన, సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పని చేయడంపై రెవెన్యూ శాఖ అధికారులకు శిక్షణ నిర్వహించారు.
Similar News
News March 22, 2026
IPL చరిత్రలోనే తొలిసారి

SRH తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్‌ను నియమించడంతో ఈ ఏడాది IPL ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. 18 సీజన్లలో తొలిసారి ఆరంభ మ్యాచ్‌లకు అన్ని జట్లకూ భారత ఆటగాళ్లే నాయకత్వం వహించనున్నారు. రజత్(RCB), శ్రేయస్(PBKS), పరాగ్(RR), హార్దిక్(MI), రుతురాజ్(CSK), అక్షర్(DC), గిల్(GT), రహానే(KKR), పంత్(LSG) టీమ్స్‌ను లీడ్ చేయనున్నారు. 2019 సీజన్ మధ్యలో ఒకట్రెండు మ్యాచ్‌లకు ఇలా జరిగింది.
News March 22, 2026
సిద్దిపేట: ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రావడం లేదు: హరీశ్ రావు

సిద్దిపేట జిల్లా నర్మెటలో ప్రారంభించనున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ప్రజాప్రతినిధుల ఫోటోలు లేవన్నారు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవాన్ని పార్టీ కార్యక్రమంలా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి రావడంలేదని స్పష్టం చేశారు.
News March 22, 2026
యుద్ధం.. కాసేపట్లో ప్రధాని మోదీ కీలక భేటీ

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ కాసేపట్లో సీనియర్ మంత్రులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. పెట్రోలియం, పవర్, ఫెర్టిలైజర్ మంత్రులు పాల్గొననున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా నిరంతరాయంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎరువుల సరఫరా, సరకు రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడటమే మీటింగ్ ఉద్దేశమని తెలిపాయి. అలాగే ఇటీవల ఇరాన్ ప్రెసిడెంట్‌తో మాట్లాడిన అంశాలపైనా మోదీ చర్చించే అవకాశం ఉంది.


