News August 19, 2025
గద్వాల: యూరియా వాటా తరలింపుపై నిరంజన్ రెడ్డి ఆరోపణ

గద్వాలకు రావాల్సిన యూరియాను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి గద్వాల కలెక్టర్ సంతోష్‌ను కలసి రైతులు, ప్రజలు, ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. గత ఏడాది నివేదిక ఆధారంగా వర్షాకాలానికి 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించడంతో రైతులకు యూరియా కొరత ఏర్పడిందని ఆయన మీడియాకు తెలిపారు.
Similar News
News March 16, 2026
ఈ తప్పులతో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి!

ఏమీ తినకున్నా కొన్నిసార్లు బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి. దీనికి 4 కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి, ఒత్తిడి, ఫుడ్ స్కిప్ చేయడం, లేవగానే కాఫీ తాగడం వల్ల అసాధారణంగా షుగర్ పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ ఉన్న వారికి ఇది హానికరమని అంటున్నారు. ‘రోజూ 7-8గంటలు నిద్రపోవాలి. మెడిటేషన్, యోగా చేయాలి. సమయానికి తినాలి. ఖాళీ కడుపుతో కెఫీన్ పదార్థాలు తాగొద్దు’ అని సూచిస్తున్నారు.

నేటి నుంచి ఒంటి పూట బడులు: డిఈవో

విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సోమవారం నుంచి ఒంటిపూట బడులు నడపాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని సూచించారు. ఎండలును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ప్రతీ పాఠశాల తప్పక నిబంధనలు పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.