News August 19, 2025

‘ఉపాధి హామీ వేతనదారులు పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి’

image

ఉపాధి హామీ పనుల లబ్ధిదారులు పోస్ట్ ఆఫీస్ వద్ద ఇండియా పోస్ట్ పేమెంట్స్ అకౌంట్ ఓపెన్ చేసుకొని వేలిముద్ర/ముఖ ప్రామాణికరణ ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవాలని ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో గోడ పత్రికను విడుదల చేశారు. పోస్ట్ ఆఫీస్ డోర్ స్టెప్ సర్వీస్ కొరకు 155299 నంబర్‌ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీకర్ బాబు పాల్గొన్నారు.

Similar News

News March 21, 2026

USకు ఇరాన్ పంచ్.. 4000km దూరంలోని బేస్‌పైకి మిస్సైళ్లు

image

యుద్ధంలో ఇరాన్ దాడులు US, ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఇండియానా ఓషన్‌లో ఉన్న US-UK మిలిటరీ బేస్‌ డియాగో గార్షియాపై 2 బాలిస్టిక్ మిస్సైళ్లు సంధించింది. ఇది ఇరాన్‌కు ఏకంగా 4000km దూరంలో ఉండటం గమనార్హం. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఒక మిస్సైల్ గాల్లోనే పేలిపోయిందని US తెలిపింది. మరొకదాన్ని తమ SM-3 ఇంటర్‌సెప్టర్ అడ్డుకుందని పేర్కొంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

News March 21, 2026

వెంకట్రావుపేటలో ఉరివేసుకొని వ్యక్తి మృతి

image

మల్లాపూర్ మండలం వెంకట్రావుపేటలో శనివారం ఉరివేసుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం వెంకట్రావుపేటలోని పెద్దమ్మ తండాకి చెందిన జరుఫుల రమేశ్ అనే వ్యక్తి గ్రామ శివారులోని మామిడి తోటలో ఉరివేసుకొని మృతి చెందాడు. కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలే ఆయన మృతికి కారణమని భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 21, 2026

NGKL: ప్రపంచ రికార్డు దిశగా SLBC సొరంగం

image

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) ప్రాజెక్టులో భాగంగా ఇన్‌లెట్ నిర్మాణ పనులను అధికారులు మళ్లీ ప్రారంభించారు. ఇప్పటికే దేవరకొండ వైపు అవుట్‌లెట్ పనులు సాగుతుండగా, రెండు వైపులా పనులను వేగవంతం చేశారు. 43.93 కి.మీ. పొడవైన ఈ సొరంగం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా రికార్డు సృష్టించనుంది. భద్రతా ప్రమాణాలతో పనులు ఆటంకం లేకుండా సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.