News August 19, 2025
నిర్మల్: టీఏవీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక

నిర్మల్ జిల్లా తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం(టీఏవీఎస్) నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశం నిర్మల్‌లోని ఇంద్రానగర్‌లోని ప్రజాసంఘాల కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆత్రం తనుష్ హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా విజయ్, కార్యదర్శిగా సంతోష్‌లను ఎన్నుకున్నారు. నవీన్, లోకేష్, నరేష్ తదితరులు కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.
Similar News
News March 14, 2026
కార్యకర్తల మధ్యే మంత్రి.. సత్యకుమార్ వినయానికి ప్రశంసలు!

ధర్మవరంలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ శిక్షణ క్లాసులో మంత్రి సత్యకుమార్ కార్యకర్తలా పాల్గొని ప్రశంసలు పొందారు. పదవిలో ఉన్నా ప్రత్యేక సదుపాయాలు కోరలేదు. తోటి కార్యకర్తలతో కూర్చొని శ్రద్ధగా వినడం ఆయన వినయాన్ని ప్రతిబింబించింది. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, సేవాభావం ప్రతీ కార్యకర్తలో ఉండాలని ఆచరణతో చూపించారు. కార్యకర్తలతో నడవడమే నిజమైన నాయకత్వమని ఈ దృశ్యం తెలుపుతోంది.
News March 14, 2026
FIFA WC, 2028 ఒలింపిక్స్‌కు నో ఎంట్రీ.. ట్రంప్‌కు షాక్ తప్పదా?

USలో ఈ ఏడాది జరిగే FIFA WC, 2028 LA ఒలింపిక్స్‌కు ట్రంప్‌ను, ప్రభుత్వ అధికారులను నిషేధించాలని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(WADA) యోచిస్తున్నట్లు సమాచారం. 2023 నుంచి తమకు చెల్లించాల్సిన $7.3 మిలియన్లను US పెండింగ్‌లో ఉంచడమే కారణమని తెలుస్తోంది. 2014 సోచి వింటర్ ఒలింపిక్స్‌లో రష్యన్, 2024లో చైనా అథ్లెట్లు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలినప్పటికీ నిర్దోషులుగా తేల్చడంతో WADA, US మధ్య విభేదాలు ముదిరాయి.
News March 14, 2026
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మంత్రి సవిత

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మంత్రి సవితను శనివారం కలిసి వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. మంత్రి వినతులు స్వీకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు.


