News August 19, 2025

మధిర: చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతు

image

మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామానికి చెందిన పెసరవల్లి వినోద్(28) వైరా నది చెక్‌డ్యామ్ వద్ద చేపల వేటకు వెళ్లి మంగళవారం గల్లంతయ్యాడు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన వినోద్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 13, 2026

గ్యాస్‌ కొరతపై అపోహలు వద్దు: కలెక్టర్‌ అంకిత్‌

image

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్‌ సరఫరాపై ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్‌ అంకిత్‌ స్పష్టం చేశారు. గ్యాస్‌ నిల్వలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొన్నారు. గ్యాస్‌ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెట్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 13, 2026

ADB: స్కాలర్ షిప్స్ నేరుగా అకౌంట్‌లో జమ

image

జిల్లాలోని ఎస్సీ విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి గాను చెల్లించాల్సిన బోధన రుసుములు (ట్యూషన్ ఫీజులు) ఉపకార వేతనాలను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత కుమారి తెలిపారు. మంజూరైన డబ్బుల్లో విద్యార్థుల నిర్వహణకు కొంత డబ్బులు మినహాయించుకొని మిగతా మొత్తాన్ని ట్యూషన్ ఫీజు కింద కళాశాలలకు చెల్లించాలని సూచించారు.

News March 13, 2026

జగిత్యాల: కౌమార విద్యపై జిల్లా స్థాయి పోస్టర్ మేళా

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు డీసీఈబీ (టీచర్స్ భవన్)లో జిల్లా స్థాయి కౌమార విద్య పోస్టర్ మేళా పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 83 పాఠశాలల నుంచి విద్యార్థులు గైడ్ టీచర్లతో కలిసి పాల్గొని కౌమార విద్యపై పోస్టర్లు రూపొందించారు. న్యాయనిర్ణేతలుగా జీవశాస్త్ర ఉపాధ్యాయులు తిరుపతి, పవన్ కుమార్, శ్రీనివాస్ పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాము విజేతలకు మెమొంటోలు అందించారు.