News August 19, 2025

తీరనున్న యూరియా కష్టాలు!

image

తెలంగాణలోని రైతులకు యూరియా కష్టాలు త్వరలో తీరనున్నాయి. 50వేల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గుజరాత్, కర్ణాటక నుంచి యూరియా తరలింపునకు ఆదేశించింది. మరో వారం రోజుల్లోనే రాష్ట్రానికి యూరియా వస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కాగా రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా చాలాచోట్ల రైతులు ఆందోళనలు చేపట్టారు.

Similar News

News August 20, 2025

కాకినాడ ఆర్మీ ర్యాలీలో తీవ్ర విషాదం

image

AP: కాకినాడలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో అపశృతి జరిగింది. 1600 మీటర్ల పరుగు పందెంలో ఓ యువకుడు అస్వస్థతకు గురై మృతి చెందాడు. మృతుడిని విజయనగరం జిల్లా శ్రీహరినాయుడుపేటకు చెందిన సాయికిరణ్‌(20)గా పోలీసులు గుర్తించారు. గమ్యానికి 100 మీటర్ల దూరంలో సాయి ఆయాసంతో పడిపోయాడు. వెంటనే కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. కానీ కాసేపటి తర్వాత ఆయన ప్రాణాలు కోల్పోయాడు.

News August 20, 2025

IPL స్టార్స్‌ సుదర్శన్, ప్రసిద్ధ్‌కు బిగ్ షాక్

image

ఆసియా కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కానీ ఐపీఎల్ 2025 ఆరెంజ్ క్యాప్ విన్నర్ సాయి సుదర్శన్, పర్పుల్ క్యాప్ విన్నర్ ప్రసిద్ధ్ కృష్ణకు చోటు కల్పించలేదు. ఐపీఎల్ ప్రామాణికంగా వీరిని ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసింది. కానీ టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్ కోసం మాత్రం వారిని పట్టించుకోలేదు. కాగా గత సీజన్‌లో సుదర్శన్ 759 రన్స్ చేయగా ప్రసిద్ధ్ 25 వికెట్లు తీసి సత్తా చాటారు.

News August 20, 2025

పాఠ్య పుస్తకాల్లో ‘ఆపరేషన్ సిందూర్’

image

NCERT కీలక నిర్ణయం తీసుకుంది. 3-12వ తరగతి విద్యార్థుల పుస్తకాల్లో ‘ఆపరేషన్ సిందూర్’ అంశాన్ని చేర్చింది. ఇందుకు సంబంధించి తాజాగా స్పెషల్ మాడ్యూళ్లు రిలీజ్ చేసింది. 3-8వ తరగతి వరకు ‘ఆపరేషన్ సిందూర్-ఏ సాగా ఆఫ్ వాల్యూర్(ఒక శౌర్య గాథ)’, 9-12వ తరగతి వరకు ‘ఆపరేషన్ సిందూర్-ఏ మిషన్ ఆఫ్ హానర్ అండ్ బ్రేవరీ(ఒక గౌరవం&ధైర్యసాహసాలు)’ టైటిళ్లతో పాఠ్యాంశాలను తీసుకువచ్చింది. పహల్గామ్ అటాక్‌ ఇందులో పొందుపర్చింది.