News August 19, 2025
సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే రికార్డు

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో మహిళలు రికార్డ్ సాధించారు. జోన్‌లోని 5 కీలకమైన వాణిజ్య, ఆపరేటింగ్, ఫైనాన్స్, సెక్యూరిటీ, వైద్య విభాగాలను మహిళా అధికారులు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్స్ మేనేజర్‌గా కె.పద్మజ, భద్రత విభాగానికి అరోమాసింగ్ ఠాకూర్, ప్రధాన ఆర్థిక సలహాదారుగా హేమ సునీత, వాణిజ్యానికి కమర్షియల్ మేనేజర్‌గా ఇతి పాండే, ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్‌గా నిర్మల నరసింహన్ ఉన్నారు.
Similar News
News August 20, 2025
బిచ్కుంద: అన్నపై కత్తితో దాడి.. తమ్ముడికి 2 ఏళ్ల జైలు

అన్నపై కత్తితో దాడి చేసిన తమ్ముడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ బిచ్కుంద కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. పాపబోయ్ 2015లో తన అన్న కుంటి రాములుపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనపై బిచ్కుంద పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అతన్ని కోర్టులో హాజరపరచగా సాక్ష్యాధారాల ఆధారంగా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వినీల్ కుమార్ తీర్పు వెలువరించారు.
News August 20, 2025
కాకినాడ ఆర్మీ ర్యాలీలో తీవ్ర విషాదం

AP: కాకినాడలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో అపశృతి జరిగింది. 1600 మీటర్ల పరుగు పందెంలో ఓ యువకుడు అస్వస్థతకు గురై మృతి చెందాడు. మృతుడిని విజయనగరం జిల్లా శ్రీహరినాయుడుపేటకు చెందిన సాయికిరణ్(20)గా పోలీసులు గుర్తించారు. గమ్యానికి 100 మీటర్ల దూరంలో సాయి ఆయాసంతో పడిపోయాడు. వెంటనే కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. కానీ కాసేపటి తర్వాత ఆయన ప్రాణాలు కోల్పోయాడు.
News August 20, 2025
సంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్‌పై చర్యలకు వినతి

సంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామికి మంగళవారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యాపారం జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.