News August 19, 2025
HYD: లిబర్టీ వద్ద గంజయితో దొరికారు..!

HYD ట్యాంక్ బండ్ పరిధి లిబర్టీ T జంక్షన్ దగ్గర సురజ్ ట్రావెల్స్ ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని దోమలగూడ పోలీసులు పట్టుకుని తనిఖీ చేశారు. వారిని గంజాయి పెడ్లర్లుగా గుర్తించి, అరెస్ట్ చేశారు. వారి నుంచి 18 కిలోల గంజాయి, 2 సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన కోమల్ సోమినాథ్ పవార్(23), సాహిల్ మహేశ్ సలున్కే(18) అరెస్టవగా విజయవాడకు చెందిన మరో నిందితుడు బాబు పరారయ్యాడు.
Similar News
News March 12, 2026
గ్యాస్ సిలిండర్ల కోసం కంగారు వద్దు: జేసీ

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ కొరత ఉండదని జేసీ నిశాంతి స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక చర్యల మూలంగా గృహ వినియోగదారులకు యథావిధిగా సరఫరా కొనసాగుతుందని తెలిపారు. గురువారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద అధికారులతో నిర్వహించిన సమావేశంలో గ్యాస్ సరఫరాపై పలు సూచనలు చేశారు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు.
News March 12, 2026
మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్

కరోనా కాలంలో మొదలై ఇప్పుడిప్పుడే పూర్తిగా తగ్గుతున్న వర్క్ ఫ్రం హోమ్ విధానం గ్యాస్ కొరతతో మళ్లీ తెరపైకి వస్తోంది. ఇవాళ, రేపు WFH చేయాలని చెన్నై ఆఫీస్ ఎంప్లాయీస్‌కి HCL టెక్ మెయిల్ చేసింది. క్యాంపస్‌లోని కేఫ్‌లో గ్యాస్ కొరతే దీనికి కారణమని పేర్కొంది. చెన్నైతో పాటు HYD, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లోని ప్రముఖ సంస్థలనూ గ్యాస్ షార్టేజ్ వేధిస్తోంది. దీంతో WFHలు పెరిగే అవకాశం ఉంది.
News March 12, 2026
యాదాద్రి నర్సన్న సేవలో నూతన గవర్నర్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ శుక్లా దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు వారికి ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం కొండపైన శివాలయాన్ని సందర్శించారు. వారికి వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ EO భవానీ శంకర్, అధికారులు పాల్గొన్నారు.


