News August 19, 2025
HYD: ‘హజ్ యాత్రికులకు గమనిక.. రేపటిలోపు డబ్బు చెల్లించాలి’

హజ్-2026 యాత్రికులకు HYDలో హజ్ కమిటీ కీలక సూచనలు చేసింది. హజ్ యాత్రకు ఎంపికైన వారు ఈనెల 20లోపు మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తం చెల్లించాలని సూచించింది. అలాగే డబ్బు చెల్లించిన రసీదు, మెడికల్ రిపోర్టులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను ఈనెల 25లోపు ఇవ్వాలని హజ్ కమిటీ ఛైర్మన్ సయ్యద్ గులామ్ అఫ్జల్ బియాబని తెలిపారు. హజ్ యాత్రికులు సాధ్యమైనంత త్వరగా ఫీజు చెల్లించాలని కోరారు.
Similar News
News August 20, 2025
EP-42: పేదరికానికి కారణాలు ఇవే: చాణక్య నీతి

ఎవరైనా తమ ఆదాయాన్ని సరిగ్గా నిర్వహించడంలో విఫలమైతే పేదరికంలో మగ్గుతారని చాణక్య నీతి చెబుతోంది. ‘డబ్బు పొదుపు చేస్తే పేదరికం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఆర్థిక ప్రణాళికల్లో నిర్లక్ష్యంగా ఉంటే అప్పులు పెరిగిపోతాయి. జూదం, మద్యం లాంటి వ్యసనాలకు బానిసైతే పేదరికంలోకి కూరుకుపోతారు. విద్యా నైపుణ్యాలు లేకపోయినా ఉపాధి దొరకక ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయి’ అని స్పష్టం చేస్తోంది. #<<-se>>#chanakyaneeti<<>>
News August 20, 2025
సంగారెడ్డి: 21వరకు గడువు పొడిగింపు

జిల్లాలోని ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ తరగతులలో ప్రవేశం పొందేందుకు ఈనెల 21 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. చదువు మధ్యలో మానేసిన వారు ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు మండలాలలోని అధ్యయన కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.
News August 20, 2025
ADB: డిగ్రీ, పీజీ చేయాలనుకుంటున్నారా..?

ఉట్నూర్ ప్రభుత్వ కళాశాలలో KU దూరవిద్య(SDLCE) పీజీ, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రాతిపాదికన దరఖాస్తు గడువును సెప్టెంబర్ 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. పీజీ 674, డిగ్రీ 673 స్టడీ సెంటర్ నంబర్ కోడ్ ద్వారా www.sdlceku.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ పత్రాలతో పాటు సర్టిఫికెట్లను కళాశాలలో అందజేయాలని సూచించారు.
SHARE IT