News August 19, 2025
విజయవాడ: సిద్ధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఇన్, ఔట్ ఫ్లో 4.66 లక్షల క్యూసెక్కులుగా నమోదైందని అధికారులు తెలిపారు. రేపటికి మరింత పెరిగే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచించింది. అత్యవసర సహాయక చర్యల కోసం కృష్ణా జిల్లా అవనిగడ్డ, NTR జిల్లా విజయవాడ, కృష్ణా ఘాట్‌లలో NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
Similar News
News March 5, 2026
కృష్ణా: అధికారులకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాలు

మే 1వ తేదీ నుంచి చేపట్టనున్న ఇళ్ల గణన కార్యక్రమంలో ఎటువంటి తప్పులు దొర్లకుండా సజావుగా పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కృష్ణా యూనివర్శిటీలో నిర్వహించిన మొదటి దశ ఇళ్ల జాబితా, జిల్లా స్థాయి అధికారుల శిక్షణా తరగతుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఎన్నికల మాదిరిగా ఈ గణన కార్యక్రమాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించి శ్రద్ధతో చేయాలన్నారు.
News March 4, 2026
కృష్ణా: 16 నుంచి ‘పది’ పరీక్షలు.. హాల్ టికెట్లు విడుదల

పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు బుధవారం విడుదలయ్యాయి. జిల్లా విద్యాశాఖాధికారి UV సుబ్బారావు తెలిపారు. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని అధికారులు చెప్పారు. హాల్ టికెట్లు కేవలం అధికారిక వెబ్‌సైట్‌లోనే ఉంటాయని, అనధికారిక సైట్లను నమ్మవద్దని హెచ్చరించారు. bre.ap.gov.in, Mana Mitra WhatsApp Governance 95523 00009 ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
News March 4, 2026
చల్లపల్లి: చాకుతో బెదిరించి.. బంగారం దోపిడీ

చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ శివారు రామానగరంలో మంగళవారం దోపిడీ కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 78 ఏళ్ల వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు వంటగదిలోకి చొరబడ్డారు. చాకుతో బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసు, చేతి గాజులు లాక్కొని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ దుర్గాంజనేయులు తెలిపారు.


