News August 19, 2025
ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్

ఎయిర్‌టెల్ ₹249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఇది అందుబాటులో ఉండదని థాంక్స్ యాప్, వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ ప్లాన్ కింద 28 రోజులపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1GB డేటా అందిస్తోంది. మరో 2 గంటలు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. కాగా ఇప్పటికే JIO సైతం ₹249 ప్లాన్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వోడాఫోన్ ఐడియా కూడా ఈ ప్లాన్‌ను రద్దు చేసే అవకాశముంది.
Similar News
News March 19, 2026
20వ రోజుకు యుద్ధం.. 2వేలకుపైగా మరణాలు!

అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ పోరు ప్రారంభమై నేటికి 20 రోజులు. పశ్చిమాసియాకు పాకిన ఈ యుద్ధంతో చమురు సంక్షోభం నెలకొనగా.. మరణాల సంఖ్య 2000 దాటింది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఇరాన్‌లో ఇప్పటివరకు 1200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో 850 మంది, ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల్లో 13 మంది చనిపోగా మరో 13 మంది US సర్వీస్ మెంబర్స్ కూడా మృతిచెందారు.
News March 19, 2026
CSKకు బిగ్ షాక్.. కీలక బౌలర్ దూరం

మరో 9 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా CSK జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్(AUS) గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఈ విషయాన్ని CSK CEO విశ్వనాథన్ తాజాగా ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. ఆయన స్థానంలో వేరే బౌలర్ కోసం చూస్తున్నామన్నారు. డెత్ ఓవర్లలో ఎల్లిస్ కీలక బౌలర్ అని, ఆయన దూరమవడం తమకు పెద్ద దెబ్బ అని విశ్వనాథన్ పేర్కొన్నారు.
News March 19, 2026
ఇరాన్ ఆ కేబుల్స్ కట్ చేస్తే ఇంటర్నెట్ బంద్!

పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇంటర్నెట్ కనెక్షన్లనూ దెబ్బతీసే ప్రమాదం ఉంది. హార్ముజ్, బాబ్-ఎల్-మాండెబ్ జలసంధుల కింద పెద్ద ఎత్తున డేటా కేబుల్స్ ఉన్నాయి. ఇవి యూరప్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను లింక్ చేస్తున్నాయి. యుద్ధంలో భాగంగా ఇవి ధ్వంసమైతే మనకు ఇబ్బందులు తప్పవు. 2024లో హౌతీల దాడుల సమయంలో ఇదే జరిగింది. పైగా మిలిటరీ యాక్టివిటీ వల్ల వాటిని రిపేర్ చేయడానికి నెలల సమయం పట్టింది.


