News August 19, 2025

ఎస్పీ హర్షవర్ధన్ రాజు విస్తృత తనిఖీలు

image

విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా నగరంలోని బస్టాండ్ వద్ద పూర్ణకుంభం సర్కిల్, ఇందిరా ప్రియదర్శిని వెజిటబుల్ మార్కెట్, రైల్వే స్టేషన్ ప్రాంతాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆటో స్టాండ్‌ను పరిశీలించారు. ఆటో డ్రైవర్‌లతో మాట్లాడారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల పట్ల డ్రైవర్లు మర్యాదగా మాట్లాడాలని సూచించారు.

Similar News

News March 4, 2026

జాన్సెన్ దూకుడు.. SA స్కోర్ ఎంతంటే?

image

T20WC: NZతో జరుగుతున్న సెమీఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్లు తడబడ్డారు. కివీస్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేశారు. మార్క్రమ్ 18, డికాక్ 10, బ్రెవిస్ 34, మిల్లర్ 6, స్టబ్స్ 29 రన్స్ చేశారు. రచిన్ రవీంద్ర, మెక్‌కొంచి, హెన్రీ రెండేసి వికెట్లు తీశారు. ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ 30 బంతుల్లోనే 55* రన్స్ చేశారు. 5 సిక్సర్లు, 2 ఫోర్లతో విరుచుకుపడ్డారు.

News March 4, 2026

బాపట్ల: ‘క్రమబద్ధమైన ప్రాక్టికల్స్ నిర్వహించాలి’

image

బాపట్లలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదుల కొరతతో బాలికల పాఠశాల విద్యార్థినీలు ఇబ్బందులు పడుతున్న విషయంపై ఆరా తీశారు. నిలిచిపోయిన అదనపు గదుల నిర్మాణాలపై విద్యాశాఖ అధికారులతో ఫోన్‌లో చర్చించారు. మౌలిక సదుపాయాలు కల్పించి గదులను ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చారు. నాణ్యమైన బోధన, క్రమబద్ధమైన ప్రాక్టికల్స్ నిర్వహించాలని సూచించారు.

News March 4, 2026

భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలోని 16 గ్రామాల్లో 1983 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని కలెక్టర్ వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ జయలక్ష్మికి తెలిపారు. ఏపీ సచివాలయం నుంచి బుధవారం జిల్లా కలెక్టర్లతో సీసీఎల్ఏ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 22 ఏ భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ వివరించారు.