News August 19, 2025
మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి

AP: 4,687 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. టెన్త్ ఉత్తీర్ణులైన వారు ఇందుకు అర్హులని వెల్లడించింది. ప్రస్తుతం ₹7,000 వేతనం అందుకుంటున్న వీరు ఇకపై ₹11,500 అందుకోనున్నారు. దీంతో పాటు 10 మంది కంటే తక్కువ విద్యార్థులున్న మినీ అంగన్‌వాడీలు, 1 KM పరిధిలోని మినీ అంగన్‌వాడీ సెంటర్లను మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాల్లో కలపాలని ప్రభుత్వం GOలో పేర్కొంది.
Similar News
News August 20, 2025
EP-42: పేదరికానికి కారణాలు ఇవే: చాణక్య నీతి

ఎవరైనా తమ ఆదాయాన్ని సరిగ్గా నిర్వహించడంలో విఫలమైతే పేదరికంలో మగ్గుతారని చాణక్య నీతి చెబుతోంది. ‘డబ్బు పొదుపు చేస్తే పేదరికం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఆర్థిక ప్రణాళికల్లో నిర్లక్ష్యంగా ఉంటే అప్పులు పెరిగిపోతాయి. జూదం, మద్యం లాంటి వ్యసనాలకు బానిసైతే పేదరికంలోకి కూరుకుపోతారు. విద్యా నైపుణ్యాలు లేకపోయినా ఉపాధి దొరకక ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయి’ అని స్పష్టం చేస్తోంది. #<<-se>>#chanakyaneeti<<>>
News August 20, 2025
ASIA CUP: ప్చ్.. శ్రేయస్ అయ్యర్

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి మొండిచేయి ఎదురైంది. ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు. దీంతో నెటిజన్లు BCCIపై ఫైర్ అవుతున్నారు. అయ్యర్‌ను BCCI రాజకీయాలకు బలి చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ స్కోరర్, ఐపీఎల్‌లో 604 పరుగుల చేసిన అతడిని పట్టించుకోకపోవడం దారుణమని దుమ్మెత్తిపోస్తున్నారు. కావాలనే అతడిని తప్పించారని వాపోతున్నారు.
News August 20, 2025
కాకినాడ ఆర్మీ ర్యాలీలో తీవ్ర విషాదం

AP: కాకినాడలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో అపశృతి జరిగింది. 1600 మీటర్ల పరుగు పందెంలో ఓ యువకుడు అస్వస్థతకు గురై మృతి చెందాడు. మృతుడిని విజయనగరం జిల్లా శ్రీహరినాయుడుపేటకు చెందిన సాయికిరణ్(20)గా పోలీసులు గుర్తించారు. గమ్యానికి 100 మీటర్ల దూరంలో సాయి ఆయాసంతో పడిపోయాడు. వెంటనే కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. కానీ కాసేపటి తర్వాత ఆయన ప్రాణాలు కోల్పోయాడు.