News August 19, 2025
యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు: కలెక్టర్

రైతులకు కాకుండా యూరియాను పక్కదారి పట్టిస్తే వ్యవసాయ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ రంజిత్ భాషా హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో యూరియా ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ షాపుల్లో అధిక ధరలకు అమ్మినా, లింకేజీలు పెట్టినా కేసులు తప్పవన్నారు. సరిహద్దు చెక్ పోస్ట్‌లలో విజిలెన్స్, పోలీస్, రవాణాశాఖ అధికారుల టీములతో తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News April 1, 2026
సైనైడ్ వాడకాన్ని నిషేధించండి: బీజేపీ

తుగ్గలి మండలం జొన్నగిరి, బొల్లవాని పల్లె, పగిడిరాయి గ్రామాలలో బంగారు వెలికితీతకు ఉపయోగిస్తున్న సైనైడ్ వాడకాన్ని నిషేధించాలని బీజెపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి గీతామాధురి, హేమ సుందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ముడి బంగారం శుద్ధి చేయడానికి ప్రాణాంతకమైన రసాయన పదార్థాలు వాడటం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రులు టీజీ భరత్, రామానాయుడుకు వినతిపత్రం అందజేశారు.
News April 1, 2026
రాయలసీమ యూనివర్సిటీకి NAAC లక్ష్యం: వీసీ

వచ్చే విద్యా సంవత్సరానికల్లా రాయలసీమ యూనివర్సిటీ NAAC అక్రిడిటేషన్ సాధించాల్సిన అవసరం ఉందని వీసీ ఆచార్య వీ.వెంకట బసవరావు పేర్కొన్నారు. IQAC ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమీక్షలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ సమాచారాన్ని క్రమపద్ధతిలో సేకరించి ఆధారాలతో అప్లోడ్ చేయాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ఉత్తమ ర్యాంక్ సాధ్యమేనని వీసీ అభిప్రాయపడ్డారు.