News August 19, 2025
గణేష్ ఉత్సవాల్లో జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ నరసింహ

గణేష్ ఉత్సవాలలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూర్యాపేట ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో కోరారు. ఎత్తైన విగ్రహాలను వాహనాలలో తరలించేటప్పుడు కరెంట్ తీగలను గమనిస్తూ వెళ్లాలని సూచించారు. ఎత్తైన విగ్రహాలు తరలించే విషయాన్ని స్థానిక పోలీసులు, ఎలక్ట్రిసిటీ అధికారులకు తెలియజేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ఆయన అన్నారు. ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.
Similar News
News March 31, 2026
ఉండి: ఆస్తి తగదా.. బంధువుపై కత్తితో దాడి

ఆస్తి తగాదాలతో ఉండికి చెందిన శేషాద్రి శ్రీనివాస్‌పై ఆయన బంధువు కత్తితో దాడి చేశారు. సోమవారం రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలైన శ్రీనివాస్ భీమవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉండి ఎస్సై నసీరుల్లా కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. కుటుంబ కలహాలే దాడికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
News March 31, 2026
మాదకద్రవ్య రహిత జిల్లాగా మారుద్దాం.. కలెక్టర్ పిలుపు

జిల్లాను మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ కోరారు. మంగళవారం డ్రగ్స్ నిరోధక కమిటీ సమావేశంలో ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. యువత మత్తుకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించారు. విద్యాసంస్థల వద్ద నిఘా పెంచి, డ్రగ్స్ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News March 31, 2026
బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం

భారత టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఆయన బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. అయితే పేస్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా గతంలో ఆయన TMCలో చేరి తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు.


