News August 19, 2025
‘ఓపెన్ స్కూల్ ఫీజు సెప్టెంబర్ 15లోపు చెల్లించండి’

ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి,ఇంటర్ ప్రవేశానికి ఫీజు చెల్లించేందుకు ఈనెల 16 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు అవకాశం ఉందని డీఈఓ నారాయణ తెలిపారు. రూ.200 అపరాద రుసుము 15 సెప్టెంబర్ లోపు చెల్లించాలని అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News August 20, 2025
భీమవరం: వినాయక చవితి ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష

వినాయక చవితి ఉత్సవాలను పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాలో సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలు నిషేధించామని, ఊరేగింపులో డీజే సౌండ్ సిస్టం వినియోగించరాదన్నారు.
News August 20, 2025
ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీలతో కలెక్టర్ సమావేశం

ప.గో. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల జాబితా సవరణ, అదనపు పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, తదితర అంశాలపై చర్చించారు. గత సంవత్సరం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పోలింగ్ స్టేషన్ల నందు ఎక్కువ సమయం పోలింగ్ ను నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఇటువంటి విషయాలపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
News August 20, 2025
భీమవరం: ఉద్యోగం ఇప్పిస్తానని రూ.9లక్షలు స్వాహా

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళకు రూ. 9లక్షలకుపైగా టోకరా వేసిన ఘటన భీమవరంలో చోటు చేసుకుంది. ఎస్సై రెహ్మాన్ తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న రాణికి తోటి ఉద్యోగి ప్రసాద్ ప్రభుత్వ హాస్పిటల్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.9 లక్షల్ల నగదును తీసుకొని ముఖం చాటేశాడు. మోసపోయానని తెలుసుకొని బాధితురాలు మంగళవారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.