News August 19, 2025
NRPT: ప్రాధాన్యత రంగాలకు అధిక రుణాలు మంజూరు చేయాలి: కలెక్టర్

ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, వ్యవసాయ మౌలిక వసతులు, ఎన్ఆర్ఎల్ఎం, పీఎంఈజీపీ పథకాలకు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన డీసీసీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ త్రైమాసికానికి రూ.809.25 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ కలెక్టర్‌కు వివరించారు.
Similar News
News March 18, 2026
PDPL: సింగరేణి కార్మికుల పెన్షన్ పెంచాలి: ఎంపీ

సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలని కోరుతూ ఎంపీ వంశీకృష్ణ బుధవారం ఢిల్లీలో సీఎమ్‌పీఎఫ్ కమిషనర్ సజీశ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. స్వల్ప పెన్షన్‌తో కార్మిక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని ఆయన వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్.. నిబంధనల మేరకు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
News March 18, 2026
నెల్లూరు: దొంగల ముఠా అరెస్ట్

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 195 ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసిన దొంగలు పట్టుబడ్డారు. వారి నుంచి 400KGల రాగి, 2ఆటోలు, 2బైక్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి SP సుబ్బరాయుడు తెలిపారు. నిందితులు గూడూరు(M) గొల్లపల్లికి చెందిన బండి వాసు(22), బూదూరు మణి(27), కత్తి పోలయ్య(40), చందు(25), ఏకోలు మధు(32)గా గుర్తించారు. మనుబోలు(M) యాచవరానికి చెందిన చల్లా రాఘవ వాళ్ల నుంచి రాగి కొనడంతో అరెస్ట్ చేశారు.
News March 18, 2026
తిరుపతిలో దొంగల ముఠా అరెస్ట్