News August 19, 2025

ఫోటోగ్రాఫర్లను సత్కరించిన మెదక్ కలెక్టర్

image

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా కలెక్టరేట్ రాహుల్ రాజ్ ఫోటోగ్రాఫర్లను సత్కరించారు. ఫోటోగ్రాఫర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రదీప్‌ను సన్మానించి మెమొంటో అందజేసి అభినందించారు. ఫోటోగ్రాఫర్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక చిత్రం ఎన్నో పదాలు, ఎన్నో అర్థాలు తెలుపుతుందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాలంటే ఫోటోలు ముఖ్యమన్నారు. డీపీఆర్ఓ రామచంద్ర రాజు ఉన్నారు.

Similar News

News March 20, 2026

విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు నిరాశాజనకం: టీపీటీఎఫ్

image

బడ్జెట్‌లో విద్యారంగానికి జరిగిన కేటాయింపులు నిరాశాజనకంగా ఉన్నాయని టీపీటీఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. యాదగిరి, పి. వెంకట్‌రామ్ రెడ్డి విమర్శించారు. మొత్తం 3,24,234 కోట్ల బడ్జెట్‌లో విద్యకు కేవలం 26,674 కోట్లు అంటే 8.22\% మాత్రమే కేటాయించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఈ నిధులు ఏమాత్రం సరిపోవని వారు పేర్కొన్నారు.

News March 20, 2026

మెదక్ DCC కార్యదర్శిగా గడ్డి వెంకటేష్

image

తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన గడ్డి వెంకటేష్ యాదవ్‌ను కాంగ్రెస్ మెదక్ జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన నేతలు మైనంపల్లి హనుమంతరావు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావులకు వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

News March 19, 2026

మెదక్: 61 మందితో డీసీసీ కార్యవర్గం ఏర్పాటు

image

61 మందితో మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంను పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇందులో ఉపాధ్యక్షులుగా 14 మంది, ప్రధాన కార్యదర్శులుగా 20 మంది, కార్యదర్శులుగా 20 మంది, అధికార ప్రతినిధులకు ఆరుగురు, ఒక కోశాధికారిని నియమించారు. మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు కె.హరిత ఉపాధ్యక్షులుగా, తోడుపునూరి శివరామకృష్ణ కోశాధికారిగా నియమింపబడ్డారు.