News August 19, 2025
అనకాపల్లి: ‘మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి’

పంచాయతీ రాజ్‌కు సంబంధించి మిగిలి ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. మంగళవారం అనకాపల్లి కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. నాబార్డ్ ఐ.ఆరై.డీ.ఎఫ్. పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవతం చేయాలన్నారు. కార్యక్రమంలో పీఆర్ కార్యనిర్వాహక ఇంజినీర్లు ప్రసాద్, శారదా కుమారి పాల్గొన్నారు.
Similar News
News March 18, 2026
PDPL: సింగరేణి కార్మికుల పెన్షన్ పెంచాలి: ఎంపీ

సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలని కోరుతూ ఎంపీ వంశీకృష్ణ బుధవారం ఢిల్లీలో సీఎమ్‌పీఎఫ్ కమిషనర్ సజీశ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. స్వల్ప పెన్షన్‌తో కార్మిక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని ఆయన వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్.. నిబంధనల మేరకు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
News March 18, 2026
నెల్లూరు: దొంగల ముఠా అరెస్ట్

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 195 ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసిన దొంగలు పట్టుబడ్డారు. వారి నుంచి 400KGల రాగి, 2ఆటోలు, 2బైక్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి SP సుబ్బరాయుడు తెలిపారు. నిందితులు గూడూరు(M) గొల్లపల్లికి చెందిన బండి వాసు(22), బూదూరు మణి(27), కత్తి పోలయ్య(40), చందు(25), ఏకోలు మధు(32)గా గుర్తించారు. మనుబోలు(M) యాచవరానికి చెందిన చల్లా రాఘవ వాళ్ల నుంచి రాగి కొనడంతో అరెస్ట్ చేశారు.
News March 18, 2026
తిరుపతిలో దొంగల ముఠా అరెస్ట్