News August 20, 2025
ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. ఉత్సవాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు.
Similar News
News August 20, 2025
అందరి సహకారంతో మాదకద్రవ్యాల నిర్మూలన: కలెక్టర్

నల్గొండ జిల్లాలో మాదక ద్రవ్యాలను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లాలో మత్తుమందుల నివారణకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి మత్తుమందుల నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ యువత మత్తుమందులకు బానిస కాకుండా అన్ని స్థాయిలలో అవగాహన కల్పించాలని అన్నారు.
News August 20, 2025
రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు కలిసికట్టుగా, సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వాహనాల వేగాన్ని నియంత్రించడం, రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరగకుండా స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేయడం, మానవ తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News August 19, 2025
పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలి: ఎస్పీ

పెండింగ్‌లో ఉన్న కేసులను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక చవితి, ఈద్ మిలాద్ ఉన్ నబీ పండగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించారు.