News August 20, 2025
HYD: తెలుగు వర్శిటీలో డా.పి.వి.రమణ స్మారక పురస్కార ప్రదానం

తెలుగు వర్శిటీలోని NTR కళామందిరంలో నాటక రచయిత డా.పి.వి.రమణ జయంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. హార్మోనిస్టు డా.టి.రాజబాబు, నటి, దర్శకురాలు సురభి ఆర్.పద్మజావర్మకు డా.పి.వి.రమణ స్మారక పురస్కారాలను వర్శిటీ ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పి.వి.రమణ బాల్యదశలోనే నటుడిగా రంగస్థలానికి పరిచయమై 18 గొప్ప నాటకాలను రచించారని కొనియాడారు.
Similar News
News March 25, 2026
NHIDCLలో 15 డిప్యూటీ మేనేజర్ పోస్టులు

కాంట్రాక్ట్ పద్ధతిలో 15 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నేషనల్ హైవేస్&ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హతలు: CA/CMA/Mcom/MBA(ఫైనాన్స్). జీతం నెలకు రూ.50,000 – 1,60,000. వయసు 34 ఏళ్లు మించకూడదు. స్టేజ్-1, స్టేజ్-2 రాత పరీక్షలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: 27.03.2026. మరిన్ని వివరాలకు www.nhidcl.com చూడండి.
News March 25, 2026
పెట్రోల్ కోసం తిరుగుతుంటే ట్యాంక్ ఖాళీ!

తెలంగాణలో కొన్నిచోట్ల పెట్రోల్ కోసం వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో కొన్ని బంకులు మూసేయగా, తెరిచి ఉన్న కొన్నింటి వద్ద భారీ క్యూలు కన్పిస్తున్నాయి. దీంతో మరోచోటుకు తిరుగుతూ ఎండలో నీరసించడంతో పాటు బండిలో ఉన్న కొద్దిపాటి పెట్రోల్ కూడా అయిపోతోందని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఇంధన కొరత లేదని చెబుతున్నా బయట పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
News March 25, 2026
వనపర్తి: క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపికలు

తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 2026-27విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతిలో ప్రవేశాల కోసం జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి సుధీర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలురకు ఈనెల 31న, బాలికలకు వచ్చేనెల 1న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర కళాశాల మైదానంలో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులు ధ్రువపత్రాలను తీసుకురావాలన్నారు.


