News August 20, 2025

రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు: మంత్రి అనగాని

image

APలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖను మంత్రి అనగాని సత్యప్రసాద్ అప్రమత్తం చేశారు. ఆ శాఖ అధికారులకు సెలవులను రద్దు చేసినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో వదంతులు, తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో కరకట్టకు ఆనుకుని ఉన్న లంక గ్రామాల ప్రజలను అవసరమైతేే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.

Similar News

News March 24, 2026

కాసేపట్లో వర్షం..

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని తెలిపారు. అటు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ ఏరియాల్లో రాబోయే 1-2 గంటల్లో వర్షం పడుతుందని పేర్కొన్నారు. మిగతా ఏరియాల్లో పొడి వాతావరణం ఉంటుందని వివరించారు.

News March 24, 2026

సర్వర్ డౌన్.. ఆగిన రిజిస్ట్రేషన్లు

image

తెలంగాణలో ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ స్తంభించిపోయింది. రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధాన సర్వర్ డౌన్‌ అవ్వడంతో ఉదయం నుంచి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపు, భూబదలాయింపు రిజిస్ట్రేషన్లు అన్నీ నిలిచిపోయాయి. ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్న వారు మళ్లీ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. సర్వర్ వస్తుందన్న ఆశతో వినియోగదారులు ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫీసులలో వేచి ఉన్నారు.

News March 24, 2026

72 గంటల ముందుగా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఫుల్ రిఫండ్

image

టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల్లో రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది. ఇకపై 72 గంటల ముందుగా టికెట్‌ను రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం(నామమాత్రపు ఫ్లాట్ క్యాన్సిలేషన్ ఛార్జీ కట్ అవుతుంది) తిరిగి ఇవ్వనుంది. 72 నుంచి 24 గంటల్లోపు అయితే 25 శాతం, 24 గంటల నుంచి 8 గంటల్లోపు అయితే 50 శాతం కట్ చేయనుంది. 8 గంటల్లోపు అయితే ఎలాంటి రిఫండ్ ఉండదు. ఏప్రిల్ 1 నుంచి 15 మధ్యలో ఈ రూల్స్‌ను అమల్లోకి తేనుంది.