News August 20, 2025
సిద్దిపేట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై జూమ్ మీటింగ్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సిద్దిపేట జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీఓలు, హౌసింగ్ డీఈలు, హౌసింగ్ ఎఈలతో జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిని గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల గ్రౌండింగ్, ఫేస్‌ల వారీగా ఆన్లైన్‌లో నమోదును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News March 13, 2026
హార్ముజ్‌లో ముగ్గురు భారత నావికుల మృతి

హార్ముజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన నౌకల్లోని ముగ్గురు భారత నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం ధ్రువీకరించింది. మరొకరి జాడ తెలియాల్సి ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో వందలాది భారతీయులతో కూడిన ఇండియన్ షిప్స్ ఉన్నట్లు తెలిపింది. వీరి భద్రతను పర్యవేక్షించేందుకు కేంద్రం 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి ప్రతి నౌకను ట్రాక్ చేస్తున్నట్లు పేర్కొంది.
News March 13, 2026
శ్రీకాకుళం: జనాభా ఆధారంగా పంచాయితీల విభజన!

ఏప్రిల్ 2వ తేదీతో పంచాయతీ సర్పంచులు పదవీకాలం ముగుస్తుంది. సకాలంలో ఎన్నికలు జరగకపోయినా, కొన్ని నెలల్లో నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 912 పంచాయతీలు ఉండగా, కొత్త పంచాయతీలు పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా 10 వేలు జనాభా దాటిన గ్రామాలను రూర్బన్, 10,000 లోపు గ్రామాలను గ్రేడు -1, జనాభా 2000 లోపు ఉంటే గ్రేడ్ -2 విభజన జాబితా కసరత్తు చేస్తున్నారు.
News March 13, 2026
ఈ యాప్ గురించి మీకు తెలుసా?

మీ ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకుపోయిందా? మూగజీవి చనిపోయి కుళ్లిన వాసనతో ఇబ్బంది పడుతున్నారా? వీటి గురించి కంప్లైంట్ చేసేందుకు ‘Swachhata’ అనే యాప్ ఉంది. వివిధ సమస్యలను ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు. నేరుగా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు వెళ్తుంది. నిర్ణీత సమయంలోగా అధికారులు ఆ సమస్యను పరిష్కరించి, ఫొటోను అప్‌లోడ్ చేస్తారు. ఇది కేవలం పట్టణ ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది.


