News August 20, 2025

NZB: 3,500 ఎకరాల ఆయిల్ పామ్ సాగుకు లక్ష్యం: కలెక్టర్

image

NZB జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగు జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం ఆయిల్ పామ్ సాగు పురోగతిపై క్లస్టర్ల వారీగా సమీక్ష జరిపి కలెక్టర్ మాట్లాడారు.
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యం నిర్ధేశించుకున్నట్లు చెప్పారు. ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలని అన్నారు.

Similar News

News March 30, 2026

NZB: కొమ్మ కొమ్మకీ వజ్రం పొదిగినట్లుగా..!

image

నగరంలోని మహాలక్ష్మీ నగర్ కాలనీలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఇక్కడి ఒక భారీ చెట్టుపై వేలాది దూది పువ్వులు పూసి, కొమ్మకొమ్మకూ వజ్రాలు పేర్చినట్లుగా కనిపిస్తున్నాయి. ప్రకృతి కురిపించిన మణిహారంలా మెరుస్తున్న ఈ దృశ్యం చూపరులను అబ్బురపరుస్తోంది. వజ్రాలు పొదిగినట్లుగా ఉన్న ఈ పూల సోయగాన్ని చూసి కాలనీవాసులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ అపురూప సౌందర్యం అద్వితీయం.

News March 30, 2026

నిజామాబాద్: తొలి ముద్దతో పోషక విప్లవం..!

image

చిన్నారుల ఆరోగ్యమే పరమావధిగా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న సుమారు 3,120 అంగన్‌వాడీ కేంద్రాల్లో త్వరలోనే ‘తొలి ముద్ద’ పథకం ద్వారా పౌష్ఠికహరంతో కూడిన అల్పాహారాన్ని అందించనుంది. ఈ నిర్ణయంతో దాదాపు 1.50 లక్షల మంది చిన్నారులకు ప్రయోజనం చేకూరనుంది. బలవర్ధకమైన ఆహారాన్ని అందించడం ద్వారా బాలల్లో వేధిస్తున్న పోషకాహార లోపాన్ని, రక్తహీనతను నివారించాలని సర్కార్ యోచిస్తోంది.

News March 30, 2026

నిజామాబాద్: 471 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు: CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన 2 వారాల్లో (ఈనెల 16 నుంచి 28వ తేదీ వరకు) 471 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. వారందరినీ కోర్టుల్లో హాజరుపరచగా రూ.43.30లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే 38 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారని CP వివరించారు.