News August 20, 2025

KNR: SRR కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

image

డిగ్రీలో మిగిలిపోయిన సీట్లను స్పాట్ ద్వారా భర్తీ చేయడానికి త్వరలో ఉన్నత విద్యా మండలి దోస్త్ ద్వారా షెడ్యూలు విడుదల చేయనుందని SRR కళాశాల ప్రిన్సిపల్ కె.రామకృష్ణ, దోస్త్ కోఆర్డినేటర్ డా.ఆర్.రామకృష్ణ తెలిపారు. SRR కళాశాలలో వివిధ కోర్సులకు పరిమిత సంఖ్యలో సీట్లు ఖాళీగా ఉన్నాయని త్వరలో విడుదలయ్యే దోస్త్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ ప్రకారం ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు.

Similar News

News August 21, 2025

KNR: ‘బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలి’

image

ఆర్థిక మద్దతు పథకాల లక్ష్య సాధనకు బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం నిర్వహించిన సమావేశంలో కోరారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 జూన్ వరకు రూ. 4314.88 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర లక్ష్యాలలో 32.12 శాతం మాత్రమే పూర్తయిందని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు.

News August 21, 2025

KNR: గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై సీపీ సమీక్ష

image

రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో శాంతిభద్రతల పర్యవేక్షణపై KNR CP గౌష్ ఆలం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

News August 20, 2025

KNR: శాతవాహన ఆచార్యునికి బెస్ట్ టీచర్ అవార్డు

image

రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ, తెలంగాణ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులను, ఆచార్యులను 2022-23 సం.కి అవార్డులను అందజేశారు. ఇందులో భాగంగా శాతవాహన విశ్వవిద్యాలయ ఉర్దూ విభాగ సహాయ ఆచార్యులు డా. నజీముద్దీన్ మునవర్‌ను ఎంపిక చేసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్ అభినందనలు తెలిపారు.