News August 20, 2025

KMR: జిల్లా విద్యార్థులకు తృతీయ బహుమతి

image

హైదరాబాద్ T-HUB, హైటెక్ సిటీలో జరిగిన ఇండియన్ స్పేస్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్-2025 పోటీల్లో 100 పాఠశాలలు పాల్గొన్నాయి. ERUDITE సంస్థ ఆధ్వర్యంలో రాకెట్ లాంచింగ్ వెహికల్స్ విభాగంలో కామారెడ్డికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ప్రాజెక్ట్ రూపొందించి తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మహతి, కేయూరి, సునేన్, శ్రీనిధిలను పాఠశాల యాజమాన్యం అభినందించారు.

Similar News

News March 12, 2026

ఏదులాపురం: ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి, కలెక్టర్

image

ఏదులాపురం మున్సిపాలిటీలోని వరంగల్ క్రాస్ రోడ్ పరిధిలో మసీదు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు భక్తి భావానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

News March 12, 2026

ఖమ్మం: పార్లమెంట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ

image

బీఆర్‌ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర బొగ్గు శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. గురువారం పార్లమెంట్ అనెక్స్ హాలులో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బొగ్గు సంస్థల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాల్సిన అవసరాన్ని ఎంపీ రవిచంద్ర సూచిస్తూ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

News March 12, 2026

వైద్యులపై ఎంజీఎం సూపరింటెండెంట్ సీరియస్

image

ఎంజీఎంలో వైద్యుల సమయపాలనపై సూపరింటెండెంట్ హరీష్ చంద్రా రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఓపీ విభాగంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉదయం 9:30 గంటలైనా జనరల్ మెడిసిన్, సర్జికల్, ఆర్థో, ఏఎంసీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తప్పవని సంబంధిత వైద్యులను హెచ్చరించారు.