News August 20, 2025
పిఠాపురం: నేటి నుంచి కోర్టు ఉద్యోగాలకు పరీక్షలు

కోర్టు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు పారదర్శకంగా ఆన్లైన్ పరీక్ష ఉంటుందని పిఠాపురం 12వ అదనపు జిల్లా జడ్జి ఎం. శ్రీహరి తెలిపారు. 20 తేదీ నుంచి మూడు రోజులపాటు కాకినాడ ,రాజమండ్రి, అమలాపురం కేంద్రాల్లో కోర్టు ఉద్యోగులకు పరీక్ష ఆన్లైన్ విధానంలో జరుగుతుందని, మెరిట్ ఆధారంగా సిబ్బంది ఎంపిక జరుగుతుందన్నారు. దరఖాస్తుదారులు దళారులను నమ్మవద్దని సూచించారు.
Similar News
News March 13, 2026
‘పారాక్వాట్ డైక్లోరైడ్’ గడ్డి మందును నిషేధించాలి: ఎంపీ వద్దిరాజు

“పారాక్వాట్ డైక్లోరైడ్”గడ్డి మందును నిషేధించాలని కోరుతూ కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వినతి పత్రం ఇచ్చారు. గడ్డి మందు స్ప్రే చేయడం వల్ల వచ్చే అనర్థాల గురించి మంత్రికి వివరించారు. విషపూరితమైన ఈ గడ్డి మందును ఒక చుక్క మింగినా ప్రాణాలు పోతున్నాయన్నారు. దీనికి విరుగుడు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 70 దేశాలు ఈ మందులు నిషేదించాయని, ఇండియాలో కూడా నిషేధించాలని కోరారు.
News March 13, 2026
కృష్ణాజిల్లాలో రేపు సెలవు రద్దు

కృష్ణా జిల్లాలోని విద్యా సంస్థలకు ఈ నెల 14న రెండో శనివారం శెలవు రద్దు చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు గురువారం తెలిపారు. మొంథా తుపాన్ సమయంలో కాంపస్ శాటరీ శెలవుల దృష్ట్యా ఈ శనివారం పాఠశాలలకు శెలవు దినం రద్దు చేసినట్లు వివరించారు. ఆ రోజు అన్ని విద్యా సంస్థలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని డీఈఓ కోరారు.
News March 13, 2026
గుంటూరు: ఈ నంబర్‌తో పోలీస్ సేవలు..!

గుంటూరు జిల్లా ప్రజలు మన మిత్ర – వాట్సాప్ గవర్నెన్స్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అని సందేశం పంపితే FIR కాపీ, కేసు స్థితి, ఈ-చలానా వివరాలు వంటి పోలీస్ సేవలు మొబైల్‌లోనే పొందవచ్చన్నారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదులకు 1930, అత్యవసర పోలీస్ సహాయానికి 112 కు కాల్ చేయాలని సూచించారు.


