News August 20, 2025

KNR: సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల గడువు పొడిగింపు

image

SRR ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తున్న క్యాండిల్ మేకింగ్, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ సర్టిఫికేట్ కోర్సులకు ప్రవేశాల గడువు ఈ నెల 31 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సర్టిఫికేట్ కోర్సులు ప్రాక్టికల్ నైపుణ్యాలు, సృజనాత్మకత అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా రూపొందించబడిందన్నారు.

Similar News

News August 20, 2025

KNR: శాతవాహన ఆచార్యునికి బెస్ట్ టీచర్ అవార్డు

image

రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ, తెలంగాణ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులను, ఆచార్యులను 2022-23 సం.కి అవార్డులను అందజేశారు. ఇందులో భాగంగా శాతవాహన విశ్వవిద్యాలయ ఉర్దూ విభాగ సహాయ ఆచార్యులు డా. నజీముద్దీన్ మునవర్‌ను ఎంపిక చేసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్ అభినందనలు తెలిపారు.

News August 20, 2025

HZB: ఆశావర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలిగా తాడూరి లత

image

హుజురాబాద్ మండలం చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్స్ యూనియన్ ( సిఐటీయూ అనుబంధ) ఎన్నికలు బుధవారం హుజురాబాద్ పట్టణంలో జరిగాయి. ఈ ఎన్నికలకు జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేశ్, ఆశావర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి మారెళ్ళీ లత హాజరై ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. తాడూరి లత (కాట్రపల్లి) ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

News August 20, 2025

KNR: పీహెచ్‌డీ పట్టాలు పొందిన అధ్యాపకులకు అభినందనలు

image

హైదరాబాద్ OUలో జరిగిన 84వ స్నాతకోత్సవంలో KNRలోని SRR ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు డా. రాపర్తి శ్రీనివాస్, డా. బండి అశోక్, డా. కీర్తి రాజేష్, డా. అందె శ్రీనివాస్‌లు డాక్టరేట్ పట్టాలు అందుకున్నారు. ఈ సందర్భంగా పట్టాలు పొందిన అధ్యాపకులకు కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ, TGCGTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.కడారు సురేందర్ రెడ్డి, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.