News August 20, 2025

నెలాఖరులోగా లక్ష్యాన్ని పూర్తి చేయండి: ఖమ్మం కలెక్టర్

image

వనమహోత్సవం కింద ఈ సంవత్సరం వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యాలను నెలాఖరు లోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజతో కలిసి వనమహోత్సవం, సీజనల్ వ్యాధులు, ప్రభుత్వ కార్యాలయాల రూఫ్‌లపై సోలార్ ప్యానెళ్ల పురోగతిపై కలెక్టర్ సంబంధిత అధికారులు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీవోలతో సమీక్షించారు. అనంతరం పలు సూచనలు చేశారు.

Similar News

News March 28, 2026

విద్యుత్ కష్టాలకు చెక్.. 296 ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధం

image

ఖమ్మం జిల్లాలో వేసవిలో అంతరాయం లేని విద్యుత్తును అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్ఈ శ్రీనివాస చారి తెలిపారు. ఇందుకోసం 296 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, 10 సబ్ స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచామన్నారు. అత్యవసర సమయాల్లో ప్రత్యామ్నాయ సరఫరా కోసం ఇంటర్‌లింకింగ్ వ్యవస్థను సిద్ధం చేశామని, ఫిర్యాదుల కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.

News March 28, 2026

వైరా: ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ సునీల్ దత్

image

వైరా పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం RTC బస్సు,కంటైనర్ లారీ ఢీకొన్న ప్రమాద స్థలాన్ని ఖమ్మం సీపీ సునీల్ దత్ సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రయాణికులకు జరిగిన గాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రహదారి భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైరా ACP సారంగపాణి, CI వెంకటప్రసాద్, SI పవన్ పాల్గొన్నారు.

News March 28, 2026

ఖమ్మం: ఈ ఒక్క రోజే అవకాశం!

image

ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న అన్నీ కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, మోటారు వాహన ప్రమాద బీమా, బ్యాంకు రికవరీ కేసులను ఇరువర్గాల అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని న్యాయమూర్తులు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని కోర్టుల చుట్టూ తిరిగే శ్రమను, ఖర్చులు తగ్గించుకోవాలని కోరారు.