News August 20, 2025
అనకాపల్లి: ‘ఎంపికైన అభ్యర్థులు ఈనెల 22న హాజరు కావాలి’

సివిల్, ఏపీఎస్సీ ఉద్యోగాలకు విశాఖలో ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులు ఈనెల 22వ తేదీన కైలాసగిరి ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో హాజరుకావాలని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలు, గెజిటెడ్ అధికారితో సంతకం చేయించిన మూడు సెట్లు జిరాక్స్ కాపీలు తీసుకురావాలన్నారు. అలాగే మూడు కలర్ ఫోటోలతో ఉదయం ఏడు గంటలకు హాజరు కావాలన్నారు.
Similar News
News March 15, 2026
అభిషేక్, నేను అగ్ని లాంటోళ్లం: సంజు శాంసన్

అభిషేక్ శర్మ, తాను ఐస్-ఫైర్‌లా ఉండమని, తాము కలిస్తే అగ్నికి అగ్ని తోడైనట్లేనని సంజూ శాంసన్ అన్నారు. ‘ఓపెనింగ్‌లో కొన్నిసార్లు నేను, ఇంకొన్నిసార్లు అభిషేక్ దూకుడుగా ఆడాం. 2024 నుంచి ఇదే చేస్తున్నాం’ అని ఇండియా టుడే కాంక్లేవ్‌లో చెప్పారు. ఇంతకుముందు అభిషేక్ ఫాలోయింగ్‌ను చూసి అసూయపడేవాళ్లమని పేర్కొన్నారు. జట్టులో అతడో సూపర్ స్టార్ అని, త్వరగా పెళ్లి చేసుకోవాలని జోక్ చేశారు.
News March 15, 2026
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్!

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మరిన్ని సౌకర్యాలను TTD అందుబాటులోకి తీసుకొస్తోంది. వసతి గృహాల్లో దిండు, దుప్పటి, చాప, బెడ్‌షీట్‌లను ఇవ్వనుంది. తొలుత నందకంలో ఇవ్వడం ప్రారంభించగా భక్తుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో వకుళామాత, పాంచజన్యం, కౌస్తుభం తదితర గెస్ట్‌హౌసుల్లోనూ అందజేయాలని నిర్ణయించింది. దుప్పటి-₹10, 2 దిండ్లు-₹10, చాప-₹10, బెడ్‌షీట్-₹20 చొప్పున చెల్లించి తీసుకోవచ్చు.