News August 20, 2025
పాఠ్య పుస్తకాల్లో ‘ఆపరేషన్ సిందూర్’

NCERT కీలక నిర్ణయం తీసుకుంది. 3-12వ తరగతి విద్యార్థుల పుస్తకాల్లో ‘ఆపరేషన్ సిందూర్’ అంశాన్ని చేర్చింది. ఇందుకు సంబంధించి తాజాగా స్పెషల్ మాడ్యూళ్లు రిలీజ్ చేసింది. 3-8వ తరగతి వరకు ‘ఆపరేషన్ సిందూర్-ఏ సాగా ఆఫ్ వాల్యూర్(ఒక శౌర్య గాథ)’, 9-12వ తరగతి వరకు ‘ఆపరేషన్ సిందూర్-ఏ మిషన్ ఆఫ్ హానర్ అండ్ బ్రేవరీ(ఒక గౌరవం&ధైర్యసాహసాలు)’ టైటిళ్లతో పాఠ్యాంశాలను తీసుకువచ్చింది. పహల్గామ్ అటాక్ ఇందులో పొందుపర్చింది.
Similar News
News March 25, 2026
సిద్దిపేటలో పోటీకి ఎవరో ఎందుకు రేవంతే రావచ్చు: హరీశ్ సవాల్

TG: తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ మళ్లీ CM కాలేడని BRS నేత హరీశ్ విమర్శించారు. ‘ఏ టైమ్‌లో గోల్ కొట్టాలో మాకు బాగా తెలుసు. వచ్చే ఎన్నికల్లో గోల్ కొట్టేది మేమే. ఎలక్షన్ ఎప్పుడొచ్చినా BRSదే గెలుపు. KCR CM. సిద్దిపేటలో పోటీకి ఎవరినో పెట్టడం ఎందుకు రేవంత్ రెడ్డే రావచ్చు’ అని సవాల్ విసిరారు. అసెంబ్లీ నిర్వహణలో GOVT విఫలమైందని, ప్రజాసమస్యలపై చర్చే లేదని మీడియాతో చిట్ చాట్‌లో విమర్శించారు.
News March 25, 2026
తమిళనాడులో ‘హీరోయిజం’ పనిచేయట్లేదా?

తమిళ రాజకీయాల్లో ఒకప్పుడు అక్కడి సినీపరిశ్రమ ఆధిపత్యం ఉండేది. మాజీ సీఎంలు MGR, కరుణానిధి, జయలలిత ఆ కోవకు చెందిన వారే. కానీ ఇప్పుడు సీన్ మారింది. 2019లో లోక్‌సభ, 2021లో TN అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ ఇప్పుడు DMK సపోర్టర్‌గా మిగిలింది. దీంతో ఈసారి ఎన్నికల బరిలోకి దిగి సోలోగా పోటీకి సిద్ధమవుతున్న విజయ్ TVK పార్టీ భవితవ్యం చర్చనీయాంశమైంది. <<-se>>#Elections2026<<>>
News March 25, 2026
బంకుల్లో రద్దీ.. వీరిపై తీవ్ర ప్రభావం!

పెట్రోల్, CNG బంకుల్లో రద్దీ వల్ల దాదాపు అందరూ ఇబ్బంది పడుతున్నారు. కానీ ఫుడ్, గ్రాసరీ డెలివరీ ఏజెంట్స్, క్యాబ్, ఆటో డ్రైవర్లు, మార్కెటింగ్ సిబ్బంది అధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ కోసం గంటల తరబడి బంకుల వద్ద వేచి చూస్తుండటంతో వారి సమయమంతా వృథా అవుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులూ ఈ పరిస్థితి వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. మీరూ ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నారా?


