News August 20, 2025
నిజామాబాద్: కబడ్డీ జట్టు చీఫ్ కోచ్‌గా ప్రశాంత్

తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సహకారంతో ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 5 వరకు హైదరాబాద్‌లో యువ తెలంగాణ ప్రో కబడ్డీ లీగ్ ఛాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. ఈ లీగ్ కోసం రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులతో 8 జట్లను ఎంపిక చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కబడ్డీ శిక్షకుడు ప్రశాంత్ ‘శాతవాహన సైనిక’ జట్టుకు చీఫ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం జిల్లా స్పోర్ట్స్ అథారిటీలో కబడ్డీ కోచ్‌గా పని చేస్తున్నారు.
Similar News
News August 20, 2025
NZB: ఇద్దరి అరెస్టు.. 8 వాహనాలు స్వాధీనం

జల్సాలకి అలవాటు పడి తెలంగాణ, మహారాష్ట్రల్లో ద్విచక్ర వాహనాలు చోరీలు చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు NZB ACP రాజా వెంకట్ రెడ్డి మంగళవారం తెలిపారు. నిందితులు బోధన్‌కు చెందిన షేక్ ఇలియాస్, షేక్ సమీర్‌లను అరెస్ట్ చేసి వారి నుంచి 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. షేక్ రియాజ్@ అరబ్@ అర్షద్ అనే నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
News August 20, 2025
NZB: 3,500 ఎకరాల ఆయిల్ పామ్ సాగుకు లక్ష్యం: కలెక్టర్

NZB జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగు జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం ఆయిల్ పామ్ సాగు పురోగతిపై క్లస్టర్ల వారీగా సమీక్ష జరిపి కలెక్టర్ మాట్లాడారు.
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యం నిర్ధేశించుకున్నట్లు చెప్పారు. ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలని అన్నారు.
News August 19, 2025
UPDATE: ATM చోరీ ఘటనను పరిశీలించిన CP

NZB టౌన్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో SBI బ్యాంక్ ATM లో గుర్తు తెలియని దుండగులు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంలో ప్రవేశించి దొంగతనానికి ప్రయత్నం చేసి పరారైన సంగతి తెలిసిందే. ఘటనా స్థలాన్ని, ఏటీఎం సెంటర్‌ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం పరిశీలించారు. ఎస్సై హరిబాబు, సీఐ శ్రీనివాస్ రాజుకు సూచనలు చేశారు. వీలైనంతవరకు త్వరగా నేరస్థులను పట్టుకోవాలని ఆదేశించారు.