News August 20, 2025
సంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్‌పై చర్యలకు వినతి

సంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామికి మంగళవారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యాపారం జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
Similar News
News August 20, 2025
బాపట్ల: శ్రీకాంత్ ప్రియురాలు అరుణ అరెస్ట్..?

సంచలనాలకు కేరాఫ్‌గా మారిన రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను నెల్లూరు జిల్లా పోలీసులు బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలోని నిడిగుంట వద్ద అర్ధరాత్రి ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అరెస్టుకు ముందు అరుణ ఓ వీడియో విడుదల చేశారు. ‘హైదరాబాద్ వెళ్తుంటే నన్ను అడ్డుకున్నారు. కొందరు నా కారులో గంజాయి పెట్టి అరెస్ట్ చేయాలి అనుకుంటున్నారు’ అంటూ ఆమె ఓ వీడియో విడుదల చేశారు.
News August 20, 2025
తిరుమల కొండపైకీ మహిళలకు ఉచిత ప్రయాణం

AP: తిరుమల కొండపైకి కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. కానీ ఘాట్ రోడ్ కావడం వల్ల సిట్టింగ్ వరకు పర్మిషన్ ఇచ్చామన్నారు. ఒక్కో బస్సులో దాదాపు 50 మంది కూర్చుని ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. ఆస్పత్రులు, పుణ్యక్షేత్రాలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లకు వెళ్లే మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు.
News August 20, 2025
ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి దర్శనం

భద్రకాళి అమ్మవారికి బుధరవారం ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. దేవస్థాన అర్చకులు తదితరులు ఉన్నారు.