News August 20, 2025

బిచ్కుంద: అన్నపై కత్తితో దాడి.. తమ్ముడికి 2 ఏళ్ల జైలు

image

అన్నపై కత్తితో దాడి చేసిన తమ్ముడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ బిచ్కుంద కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. పాపబోయ్ 2015లో తన అన్న కుంటి రాములుపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనపై బిచ్కుంద పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అతన్ని కోర్టులో హాజరపరచగా సాక్ష్యాధారాల ఆధారంగా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వినీల్ కుమార్ తీర్పు వెలువరించారు.

Similar News

News August 20, 2025

బాపట్ల: శ్రీకాంత్ ప్రియురాలు అరుణ అరెస్ట్..?

image

సంచలనాలకు కేరాఫ్‌గా మారిన రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను నెల్లూరు జిల్లా పోలీసులు బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలోని నిడిగుంట వద్ద అర్ధరాత్రి ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అరెస్టుకు ముందు అరుణ ఓ వీడియో విడుదల చేశారు. ‘హైదరాబాద్ వెళ్తుంటే నన్ను అడ్డుకున్నారు. కొందరు నా కారులో గంజాయి పెట్టి అరెస్ట్ చేయాలి అనుకుంటున్నారు’ అంటూ ఆమె ఓ వీడియో విడుదల చేశారు.

News August 20, 2025

తిరుమల కొండపైకీ మహిళలకు ఉచిత ప్రయాణం

image

AP: తిరుమల కొండపైకి కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. కానీ ఘాట్ రోడ్ కావడం వల్ల సిట్టింగ్ వరకు పర్మిషన్ ఇచ్చామన్నారు. ఒక్కో బస్సులో దాదాపు 50 మంది కూర్చుని ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. ఆస్పత్రులు, పుణ్యక్షేత్రాలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లకు వెళ్లే మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు.

News August 20, 2025

ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి దర్శనం

image

భద్రకాళి అమ్మవారికి బుధరవారం ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. దేవస్థాన అర్చకులు తదితరులు ఉన్నారు.