News August 20, 2025

ఆ నలుగురే ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవమయ్యారు!

image

దేశంలో ఇప్పటివరకు 16సార్లు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఐదుసార్లు మాత్రమే ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారిలో సర్వేపల్లి రాధాకృష్ణన్(2 సార్లు), గోపాల్ స్వరూప్ పాఠక్, జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా, శంకర్ దయాల్ శర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా అన్ని సందర్భాల్లో ప్రతిపక్షాలు అభ్యర్థిని నిలబెట్టాయి. ప్రస్తుతం NDA నుంచి రాధాకృష్ణన్, కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి బరిలో ఉన్నారు.

Similar News

News March 5, 2026

వాంఖడే పిచ్‌ ఎవరికి కలిసొస్తుందో?

image

ఈరోజు IND-ENG సెమీస్‌లో వాంఖడే పిచ్ కండీషన్ ముఖ్యపాత్ర పోషించనుంది. సాధారణంగా ఇది బ్యాటింగ్ పిచ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్టు పరుగుల వరద పారించొచ్చు. అయితే ఇప్పుడు ఆ పిచ్‌పై పచ్చిక ఉండటం చర్చనీయాంశమైంది. దీనిపై కోచ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేయగా, సిబ్బంది పచ్చికను తొలగించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. పచ్చిక ఎక్కువుంటే పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుంది. అదే తేమ ఎక్కువైతే బ్యాటర్లకు కలిసొస్తుంది.

News March 5, 2026

ఇవాళ, రేపూ భారీ నష్టాలు తప్పవా?

image

ఇరాన్ వార్‌తో భారత స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. చివరి 3 సెషన్లలో ఏకంగా రూ.21.29 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. గత శనివారం యుద్ధం ప్రారంభం కాగా మరుసటి రోజు ఆదివారం, 3న(మంగళవారం-హోలీ) మార్కెట్లకు సెలవులు కావడంతో మరింత భారీ నష్టం తప్పింది. అయితే యుద్ధం ఇంకా కొనసాగుతుండటం, ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇవాళ, రేపటి సెషన్లపై ‘బేర్’ పంజా తప్పేలా లేదు.

News March 5, 2026

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

image

<>డిజిటల్<<>> ఇండియా కార్పొరేషన్ 12 కో ఆర్డినేటర్& సెక్యూరిటీ అడ్మిన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంఏ(ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్), డిగ్రీ, బీఎస్సీ(CS) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://dicmedia.digitalindiacorporation.in