News August 20, 2025

హిందూపురం వచ్చే.. వందే భారత్ రైలు ఆగే..!

image

యశ్వంతపూర్ నుంచి కాచిగూడ వెళ్లే వందే భారత్ రైలు హిందూపురంలో ఆగేందుకు రైల్వే ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రైలు ఇంతకు ముందు యశ్వంతపూర్ నుంచి ధర్మవరం మీదుగా కాచిగూడ వెళ్లేది. హిందూపురం ప్రజల కోరిక మేరకు ఎంపీ బీకే పార్థసారది రైల్వే శాఖ మంత్రి సోమన్నను కలిసి హిందూపురంలో రైలు ఆగేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో మంగళవారం నుంచి వందే భారత్ రైలు హిందూపురంలో ఆగుతుందని అధికారులు వెల్లడించారు.

Similar News

News March 6, 2026

MBNR: అధిక ఎండలు.. ప్రజల బెంబేలు

image

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో.. చిన్న చింతకుంట మండలం నంది వడ్డేమాన్‌లో, కోయిలకొండ మండలం పారుపల్లిలో 38.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. భూత్పూర్ 38.4, చిన్న చింతకుంట 38.1, అడ్డాకుల 38.0, మిడ్జిల్ మండలం కొత్తపల్లి, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 37.9, కౌకుంట్ల, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్, మూసాపేట మండలం జానంపేట 37.8, దేవరకద్ర 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

News March 6, 2026

విశాఖ: 5 నిమిషాల ఆలస్యంతో అవకాశం కోల్పోయారు

image

రైల్వే టెక్నీషియన్ గ్రేడ్-3 పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో సుమారు పది మంది అభ్యర్థులు అవకాశం కోల్పోయారు. పెందుర్తి చినముషిడివాడ డిజిటల్ అయాన్ సెంటర్‌లో శుక్రవారం ఉదయం మొదటి షిఫ్ట్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉదయం 7:30 నుంచి 8:30 వరకు రిపోర్టింగ్ సమయం కాగా, అభ్యర్థులు 8:35 గంటలకు రావడంతో వారిని అనుమతించలేదు. ఈ పరీక్షకి ఒడిశా నుంచి వచ్చామని, అవకాశం కోల్పోయామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

News March 6, 2026

నేడు కరీంనగర్‌కు మంత్రుల రాక: ‘ప్రజా పాలన’పై సమీక్ష

image

కరీంనగర్ జిల్లాలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ నిర్వహణపై సమీక్షించేందుకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర మంత్రులు శుక్రవారం నగరానికి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే ఈ కీలక సమావేశంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. ప్రగతి ప్రణాళిక అమలు, ప్రజా సమస్యల పరిష్కార మార్గాలపై ఈ సందర్భంగా దిశానిర్దేశం చేయనున్నారు.