News August 20, 2025

అధికారులు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

image

భారీ వర్షాలు, మరోవైపు గోదావరి వరద ఉద్ధృతి నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అయినా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గోదావరి ఏటిగట్టు వెంబడి బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఇసుక బస్తాలతో వాటిని బలోపేతం చేయాలని సూచించారు.

Similar News

News March 6, 2026

KMR: దొంగతనం.. ఎనిమిది నెలల జైలు

image

చోరీకి పాల్పడిన నిందితుడికి కోర్టు 8నెలల జైలుశిక్షతో పాటు ₹300 ఫైన్ విధించింది. SP రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలు.. భిక్కనూర్ వాసి వేణు ఇంటికి తాళం వేసి వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి చూడగా తలుపులు పగులగొట్టి ఉన్నాయి. ₹10 వేలు చోరీకి గురైనట్లు గుర్తించారు. చిట్లపల్లి సాగర్ చోరికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడికి శిక్ష, జరిమానా ఖరారు చేసింది.

News March 6, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 6)

image

* 1899: తెలుగు రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ జననం
* 1913: తొలితరం హాస్యనటుడు కస్తూరి శివరావు జననం
* 1917: సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు జననం
* 1919: సాహితీవేత్త గడియారం రామకృష్ణ శర్మ జననం
* 1933: సినీ నటి కృష్ణకుమారి జననం (ఫొటోలో)
* 1964: పిఠాపురం చివరి రాజు మహీపతి సూర్యారావు మరణం
* 2016: నటుడు కళాభవన్ మణి మరణం

News March 6, 2026

కామారెడ్డి: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య.. కారణమిదే!

image

ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన దేవున్‌పల్లి PS పరిధిలో గురువారం జరిగింది. SHO రంజిత్ తెలిపిన వివరాలు.. గాయత్రి నగర్ వాసి సాయిబాబా(33) బీడీ కంపెనీ టేకేదార్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు విడిచాడు. మృతుడి భార్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SHO వెల్లడించారు.