News August 20, 2025

ఏపీలో శ్రీకాకుళం జిల్లా ముందంజ: కలెక్టర్

image

పీ-4 పథకం అమలులో శ్రీకాకుళం జిల్లా ఏపీలో ముందంజలో నిలిచిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టర్‌లో మాట్లాడారు. 64,166 బంగారు కుటుంబాల్లో 61,552 కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారా లక్ష్యం చేరుకున్నామని వెల్లడించారు. దీంతో 1,55,804 లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారని వివరించారు. రహదారుల మీదుగా వేలాది మొక్కలు నాటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Similar News

News March 27, 2026

ఎచ్చెర్ల: సెమిస్టర్ల ఎగ్జామ్ షెడ్యూలు విడుదల

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ LLB(3Y)కి సంబంధించి 2, 4, 6వ సెమిస్టర్లు, (5Y)కి 2, 4, 6, 10 సెమిస్టర్ల పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 21వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నట్లు యూనివర్సిటీ డీన్ డాక్టర్ యు.జ్యోష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పరీక్ష ఫీజు రూ.800, ప్రాక్టికల్ ఫీజు రూ.250లతో కలిపి మొత్తం రూ.1,050లను ఏప్రిల్ 12వ తేదీలోపు యూనివర్సిటీ, కళాశాలల్లో చెల్లించాలని కోరారు.

News March 27, 2026

టెక్కలిలో 29న రగ్బీ రాష్ట్రస్థాయి పోటీల ఎంపికలు

image

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 29వ తేదీన 9 గం.లకు జిల్లా స్థాయి రగ్బీ మెన్ అండ్ ఉమెన్ క్రీడాకారుల ఎంపికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని శ్రీకాకుళం జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి పార్వతీశం నేడు ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా రగ్బీ సెక్రటరీ నారాయణ రావు(85000 07272 ,78424 23423) నంబర్లను సంప్రదించాలన్నారు.