News August 20, 2025
గుంటూరు: 75 ఏళ్ల వృద్ధుడికి జీవిత ఖైదు

ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో 2019లో మనవరాలిని హత్య చేసిన 75 ఏళ్ల దారా యాకోబుకు నరసరావుపేట 13వ అదనపు జిల్లా న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది. కుటుంబ విభేదాల నేపథ్యంలో తాతయ్య యాకోబు (A1) కత్తితో దాడి చేయడంతో ఆమె మరణించింది. ఈ కేసు దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా చూసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ సతీశ్ కుమార్ అభినందించారు.
Similar News
News March 21, 2026
WGL: నాలుగు మండలాల్లోనే వర్షం

వరంగల్ జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షపాతం సగటున 0.9 మిల్లీమీటర్లు నమోదుకగా, జిల్లా వ్యాప్తంగా 4.9 మిల్లీమీటర్లు వర్ష పాతం నమోదైంది. జిల్లాలోని 13 మండలాల్లో సంగేంలో 1.8 మిల్లీమీటర్లు, కిలా వరంగల్‌లో 1.5 మిల్లీమీటర్లు, వరంగల్‌లో 0.8 మిల్లీమీటర్లు, గీసుకొండలో 0.8 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదుకగా, మిగిలిన 9 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.
News March 21, 2026
మాకు భయపడి రూ.1.21 లక్షల కోట్ల వార్‌షిప్ పారిపోయింది: IRGC

తమ దెబ్బకు భయపడి అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ‘గెరాల్డ్’ యుద్ధక్షేత్రం నుంచి వెనక్కి వెళ్లిపోయిందని ఇరాన్ IRGC అధికార ప్రతినిధి తెలిపారు. ‘కేవలం వేల డాలర్ల విలువైన మా స్పీడ్ బోట్లకు 13 బిలియన్ డాలర్ల (రూ.1.21 లక్షల కోట్లు) విలువైన వార్‌షిప్ ఎందుకు భయపడింది? మీరు పేపర్ టైగర్లు మాత్రమే. మా వీరుల పోరాటానికి మీ దగ్గర సమాధానం లేదు. మీరు ఓడిపోయారు. విజయం మాదే’ అని స్పష్టం చేశారు.
News March 21, 2026
కరీంనగర్: థియేటర్‌లో సందడి చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సందడి చేశారు. నగరంలోని ఓ సినిమా థియేటర్‌లో విడుదలైన ‘దురంధర్-2’ చిత్రాన్ని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులతో కలిసి వీక్షించారు. చిత్ర బృందాన్ని అభినందించిన ఆయన, సినిమా ఆకట్టుకునేలా ఉందన్నారు. కేంద్ర మంత్రి రాకతో థియేటర్ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. అభిమానులు, కార్యకర్తలు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు.


