News August 20, 2025
మొదటి ప్రమాద హెచ్చరిక చేరువలో గోదావరి

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ రోజు తెల్లవారుజామున 6 గంటలకు 42.2 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. దీంతో వరద నీరు కళ్యాణకట్ట వరకు చేరింది. నీటిమట్టం 43 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నది వద్ద అధికారులు గజ ఈతగాళ్లు, లాంచీలు ఏర్పాటు చేశారు.
Similar News
News April 1, 2026
దారపు రీల్స్‌తో రామ మందిరం!

పనికిరాని వస్తువులతో అద్భుత కళాఖండాలను సృష్టించవచ్చని వెలుగుబందకు చెందిన ఉపాధ్యాయుడు భాస్కట పవన్ కుమార్ నిరూపించారు. శ్రీరామనవమి సందర్భంగా దారపు రీల్స్, వాడేసిన అట్టలతో ‘అయోధ్య రామ మందిరం’ నమూనాను అందంగా తయారు చేశారు. బుధవారం ఈ నమూనాను చూసిన తోటి ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు. ‘రీయూస్’ నినాదంతో విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
News April 1, 2026
సిరిసిల్ల: రైల్వేశాఖమంత్రి అశ్విని వైష్ణవ్‌కు కేటీఆర్ లేఖ

రైల్వేశాఖమంత్రి అశ్విని వైష్ణవ్‌కు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ఈ లేఖను బీఆర్‌ఎస్ ఎంపీలు మంత్రికి అందజేయగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కాజీపేటలో రైల్వే డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని, దీని వల్ల కార్యకలాపాల వికేంద్రీకరణ జరిగి, ఉత్తర, తూర్పు తెలంగాణలో రైల్వే సేవలు మెరుగుపడతాయని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. 2,755 కి.మీ. రైల్వే లైన్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
News April 1, 2026
గద్వాల్: రైలు కిందపడి యువకుడి సూసైడ్

గద్వాల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రైలు కిందపడి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ తెలిపిన వివరాలు.. మానవపాడు మం, కొర్విపాడు గ్రామానికి చెందిన యుగంధర్(21) సాయంత్రం కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


