News August 20, 2025

HYDలో 24 Hrs బస్సులు నడపాలా? మీ కామెంట్!

image

ప్రపంచదేశాల ప్రజలు జీవిస్తున్న మహానగరంలో 24 గంటల పాటు ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తార్నాక, హబ్సిగూడ, ఎల్బీనగర్, కోఠి, పంజాగుట్ట, అమీర్‌పేట్, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో అర్ధరాత్రి విధులు ముగించే మహిళలకి ఇబ్బంది అవుతుందని తెలిపారు. ప్రైవేటు ట్రావెల్స్ దీనిని అదునుగా చేసుకుని డబ్బులు దోచేస్తున్నాయని ఆరోపించారు. నైట్‌షిఫ్ట్ బస్సులు నడపాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News August 20, 2025

ప్రణాళికాబద్ధంగా భూ సేకరణ పూర్తి చేయాలి: అ.కలెక్టర్

image

నీటిపారుదల ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా పెండింగ్ భూ సేకరణ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి నీటి పారుదల ప్రాజెక్టుల భూ సేకరణపై సమీక్షించారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో వివిధ ప్యాకేజీలలో మొత్తం 3,778 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1,964 ఎకరాల భూ సేకరణ పూర్తి చేశామన్నారు.

News August 20, 2025

నాగర్‌కర్నూల్‌: ‘గణేష్ మండపాలకు దరఖాస్తు చేసుకోవాలి’

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో గణేష్ మండపాలు ఏర్పాటు చేయాలనుకునేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. policeportal.tspolice.gov.in పోర్టల్‌లో కమిటీ, మండపం వివరాలు, ఫోన్‌ నంబరు వంటి సమాచారం తప్పనిసరిగా నమోదు చేయాలని ఆయన సూచించారు. ప్రమాదాల నివారణకు ఈ జాగ్రత్తలు అవశ్యమని పేర్కొన్నారు.

News August 20, 2025

కంది ఐఐటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లకు ఆహ్వానం

image

సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదారాబాద్‌లో కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ విభాగంలో ప్రత్యేక రౌండ్ పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి స్పాన్సర్ చేసిన ప్రాజెక్టుల ద్వారా నిధులు సమకూరుతాయన్నారు. ఆసక్తి గలవారు సెప్టెంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు cse.iith.ac.in/admissions/phd లింకులో చూడాలని కోరారు.
-SHARE IT