News August 20, 2025
విజయవాడ దుర్గమ్మ ఆలయంలో.. RMPనే పెద్ద వైద్యుడు!

రాష్ట్రంలో రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో వైద్య సేవలు నామమాత్రంగా ఉన్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాదిగా భక్తులు వస్తున్నా, వారికి వైద్యం అందించేందుకు ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేరు. కేవలం ఓ ఆర్‌ఎంపీ మాత్రమే సేవలు అందిస్తుండగా, ఉన్న ఒక్క అంబులెన్సులోనూ సౌకర్యాలు లేవు. దసరా ఉత్సవాలు సమీపిస్తున్నందున తక్షణం శాశ్వత వైద్యులను నియమించాలని కోరుతున్నారు.
Similar News
News August 20, 2025
ఢిల్లీకి CM రేవంత్.. రేపటి OU పర్యటన వాయిదా

TG: సీఎం రేవంత్‌రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ సందర్భంగా రేవంత్ సైతం ఢిల్లీకి వెళ్లాల్సి రావడంతో ఆయన ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన వాయిదా పడింది. ఓయూ క్యాంపస్‌లో నిర్మించిన కొత్త హాస్టల్ భవనాలు, ఇతర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఈ నెల 21న రేవంత్ ఉస్మానియాకు వెళ్లాల్సి ఉంది.
News August 20, 2025
BHPL: గోదావరి వరద ఉధృతి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

భూపాలపల్లి జిల్లాలో గోదావరి నది నీటిమట్టం పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామన్నారు. బుధవారం కలెక్టర్, ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి కాళేశ్వరంలోని గోదావరి, సరస్వతి ఘాట్ల వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. ప్రజల ప్రాణాలను రక్షించే విషయంలో యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
News August 20, 2025
ప్రణాళికాబద్ధంగా భూ సేకరణ పూర్తి చేయాలి: అ.కలెక్టర్

నీటిపారుదల ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా పెండింగ్ భూ సేకరణ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి నీటి పారుదల ప్రాజెక్టుల భూ సేకరణపై సమీక్షించారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో వివిధ ప్యాకేజీలలో మొత్తం 3,778 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1,964 ఎకరాల భూ సేకరణ పూర్తి చేశామన్నారు.