News August 20, 2025
పూడూరు: రూ.3వేలు కట్టు.. రేషన్‌కార్డు పట్టు!

కొత్త రేషన్‌కార్డు కావాలా రూ. 3,000 ఇవ్వండి.. 2 రోజుల్లో ఇప్పిస్తామని నయా దందాకు మీసేవ నిర్వాహకుడు తెర లేపాడు. పూడూరులోని మీసేవ సెంటర్‌లో కొత్త రేషన్ కార్డు ఇప్పిస్తానని రూ.3,000 తీసుకొని, అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని తహశీల్దార్ భరత్ గౌడ్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని మండల ఆఫీసులలో రేషన్ కార్డు జారీకి చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ కామెంట్.
Similar News
News March 12, 2026
సిలిండర్లు నిల్వ ఉంచుకోవద్దు.. కేంద్రం సూచన

దేశంలో గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందొద్దని కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ వెల్లడించింది. LPG ఉత్పత్తి పెంపు, సరఫరాలో ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంది. 2.5 రోజుల్లోనే సిలిండర్లు డెలివరీ చేస్తున్నామని తెలిపింది. ప్రజలు ఆందోళన చెంది హడావుడిగా బుకింగ్స్ చేయడం లేదా సిలిండర్లు నిల్వ ఉంచుకోవాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. అవసరమైన సమయంలో ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.
News March 12, 2026
విద్యార్థులకు మాతృ హృదయంతో బోధించాలి: డా. స్వప్న

పిల్లలకు మొదటి గురువు తల్లి అని, విద్యార్థులకు మాతృ హృదయంతో బోధించాలని సెన్సార్ బోర్డు మెంబర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. కళ్లెం స్వప్న అన్నారు. గురువారం తపస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ సుజాత అధ్యక్షతన మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఉపాధ్యాయుల బోధన విద్యార్థుల్లో ప్రగాఢ విశ్వాసాన్ని పెంపొందిస్తుందని, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కొనియాడారు.
News March 12, 2026
పకడ్బందీగా టెన్త్ వార్షిక పరీక్షలు: HNK కలెక్టర్

ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని HNK కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె మాట్లాడుతూ..12079 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరవుతారని, ఇందుకు 64 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 64 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 64 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 64 మంది సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బంది నియమించారు.


