News August 20, 2025
విజయనగరంలో గంజాయితో ఇద్దరు అరెస్టు

గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని మంగళవారం అరెస్టు చేసినట్లు విజయనగరం వన్ టౌన్ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి మంగళవారం తెలిపారు. ఒడిశాలోని మునుగడకు చెందిన రాందాస్ గంట, అంతరామి మల్లిక్‌ను విజయనగరం రైల్వే స్టేషన్ ఎదురుగా 10 కేజీల గంజాయితో పట్టుకున్నామన్నారు. వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. అనంతరం గంజాయి సీజ్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
Similar News
News March 11, 2026
VKB: నూతన సర్పంచులకు రేపు అవగాహన సదస్సు: కలెక్టర్

నూతనంగా గెలుపొందిన సర్పంచులకు రేపు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గౌలి కార్ ఫంక్షన్ హాల్లో గురువారం నూతనంగా ఎంపికైన సర్పంచ్లకు ప్రజాపాలనలో భాగంగా 99 రోజుల ప్రణాళికపై అవగాహన కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. సర్పంచులంతా పాల్గొని ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ కోరారు.
News March 11, 2026
PDPL: ‘ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి’

ఎరువులు అధిక మోతాదులో వాడటం వల్ల భూసారం దెబ్బతింటుందని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. అందుకే ఎరువుల వాడకం తగ్గించి, సరఫరాను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం యూరియా సరఫరా కోసం ప్రత్యేక యాప్ ప్రవేశపెట్టిందని ఆయన వెల్లడించారు. బుధవారం రంగాపూర్ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు.
News March 11, 2026
‘ధురంధర్-2’ రన్‌టైమ్ ఎఫెక్ట్.. టికెట్ రేట్లు పెరుగుతాయా?

‘ధురంధర్-2’పై భారీ అంచనాలు నెలకొన్న వేళ ఆ మూవీ రన్‌టైమ్ 3 గంటల 55 నిమిషాలు (దాదాపు 4 గంటలు) ఉండటం చర్చనీయాంశమైంది. ఇది మల్టీప్లెక్సులకు సవాల్‌గా మారినట్లు తెలుస్తోంది. భారీ రన్‌టైమ్ వల్ల షోల సంఖ్య తగ్గిపోతుందని.. ఫలితంగా డైలీ గ్రాస్‌పై ఎఫెక్ట్ పడుతుందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. దానిని భర్తీ చేసేందుకు టికెట్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఆడియన్స్‌కు భారంగా మారుతుంది.


