News August 20, 2025

వాడపల్లిలో కోనేరుకు మహర్దశ: రూ. 2.5 కోట్లతో అభివృద్ధి

image

కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలోని కోనేరుకు మహర్దశ పట్టింది. దశాబ్దాలుగా ఆదరణకు నోచుకోని ఈ కోనేరును రూ.2.5 కోట్ల నిధులతో ఆధునికంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయానికి తూర్పున, గోదావరి ఏటి గట్టును ఆనుకొని ఉన్న ఈ కోనేరు నిర్మాణం పూర్తయితే వాడపల్లి దేవస్థానానికి మరింత శోభ రానుంది.

Similar News

News March 27, 2026

TRS ఆవిర్భవించిన 25 ఏళ్ల తర్వాత…

image

తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. APR 25న <<19491261>>కవిత<<>> కొత్త పార్టీ పెట్టనున్నారు. తండ్రి KCR స్థాపించిన TRS(2001)లో రాజకీయ ఓనమాలు దిద్దిన ఆమె.. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత కొత్త జెండా పట్టనున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో TRS(ఇప్పుడు BRS) అధికారం చేపట్టగా కవిత MP, MLCగా పనిచేశారు. అనూహ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో ఆమె జైలుకెళ్లడంతో పార్టీలో విభేదాలు వచ్చాయి. దీంతో కవిత BRS నుంచి బయటికి వచ్చారు.

News March 27, 2026

కొత్తగూడెం రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి

image

భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ ఏర్పడి వందేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ చారిత్రక నేపథ్యాన్ని కొనసాగించాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విన్నవించారు. మంత్రికి వినతిపత్రం అందజేసి కొత్తగూడెం కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ నెలకొల్పాలని వినతి పత్రం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత సురేష్ రెడ్డి ఉన్నారు.

News March 27, 2026

కేసీఆర్ యాదాద్రి అభివృద్ధి.. రేవంత్ భద్రాద్రిపై ఫోకస్

image

పదేళ్ల పాలనలో యాదాద్రి అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్, భద్రాచలం విషయంలో నిర్లక్ష్యం వహించారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రిపై ప్రత్యేక దృష్టి సారించి నేడు శ్రీరామనవమి సందర్భంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలి దశలో రూ.351 కోట్లు విడుదల చేసి గోదావరి కరకట్ట, భక్తులకు వసతులు, ఆలయ విస్తరణ వంటి పనులు చేపట్టనున్నారు.