News August 20, 2025
తిరుమల కొండపైకీ మహిళలకు ఉచిత ప్రయాణం

AP: తిరుమల కొండపైకి కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. కానీ ఘాట్ రోడ్ కావడం వల్ల సిట్టింగ్ వరకు పర్మిషన్ ఇచ్చామన్నారు. ఒక్కో బస్సులో దాదాపు 50 మంది కూర్చుని ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. ఆస్పత్రులు, పుణ్యక్షేత్రాలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లకు వెళ్లే మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు.
Similar News
News March 5, 2026
మాయిస్ట్ హీట్‌తో ఈ సమ్మర్ వెరీ హాట్!

గాలిలో ఉష్ణోగ్రతతో పాటు తేమ ఎక్కువగా ఉంటే ‘మాయిస్ట్ హీట్’ అంటారు. ఈ సమ్మర్‌లో ఇది ఎక్కువ రోజులు ఉండనుంది. ‘సాధారణంగా ఎండలకు పట్టిన చెమట గాలికి ఆవిరై శరీరం చల్లబడుతుంది. మాయిస్ట్ హీట్‌తో గాలిలో తేమ ఉండటం వల్ల చెమట ఆవిరి కాదు. అయినా శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. దీంతో దాహం వేయకపోయినా నీరు తాగాలి’ అని నిపుణులు సూచిస్తున్నారు. గాలిలో తేమ 60%, టెంపరేచర్ 30°C ఉంటే అది మనకు 40°C మాదిరి అనిపిస్తుంది.
News March 5, 2026
421 పోస్టులు.. దరఖాస్తుకు 3 రోజులే అవకాశం

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో 421 పోస్టులకు అప్లై చేయడానికి 3రోజులే(మార్చి 8) అవకాశం ఉంది. పోస్టును బట్టి డిగ్రీ, MBA/PGDM, CA/CFA/CMA అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ స్క్రూట్నీ, ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in/
News March 5, 2026
రాష్ట్రానికి భారీ వర్షసూచన!

TG: రాష్ట్రంలో ఈ నెల 18/19 తర్వాత మరోసారి అన్‌సీజనల్ రెయిన్స్‌కు ఆస్కారముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత నెల 23-24 తేదీల్లో కురిసిన వర్షాల కంటే భారీగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే అప్పటి వరకూ ఎండలు తీవ్రంగా ఉంటాయని, 40+°C టెంపరేచర్ నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో 36-37°C మధ్య ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేశారు.


