News August 20, 2025

‘జూబ్లీహిల్స్‌ టికెట్ నాదే.. లేదు నాది..!’

image

త్వరలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ప్రతీ డివిజన్‌లో సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలోని కీలక నేతలు తమకే టికెట్ అన్నట్లు ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అధికార పార్టీ నుంచి రేసులో అంజన్ కుమార్ యాదవ్, ఆజారుద్దీన్, నవీన్‌యాదవ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పలువురు నేతలు ఢిల్లీ పెద్దలను కలిస్తున్నారు.

Similar News

News August 20, 2025

పురానాపూల్: పాఠశాలను సందర్శించిన కలెక్టర్

image

పురానాపూల్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, స్థానిక పాఠశాలను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఈరోజు సందర్శించారు. డిజిటల్ క్లాసులతో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. విద్యార్థులు మంచిగా చదువుకుంటూనే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందన్నారు.అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీజనల్ వ్యాధులకు సంబంధించి మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు నియంత్రించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

News August 20, 2025

HYD: హైటెక్ సిటీ కట్టినప్పుడు అవహేళన చేశారు: సీఎం

image

హైటెక్ సిటీ కట్టినప్పుడు అవహేళన చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో మాట్లాడుతూ.. నగరం సింగపూర్, టోక్యోతో పోటీ పడుతోందని, మన వద్ద అన్ని ఉన్నప్పుడు చిత్తశుద్ధితో పనిచేయడం కావాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలతో కూడిన ఉద్యోగ భద్రత ఇచ్చామని, రాబోయే పదేళ్లలో వన్ బిలియన్ డాలర్ల ఎకనామీగా తీర్చిదిద్దుతామన్నారు.

News August 20, 2025

HYD: ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు జాగ్రత్త: DCP

image

HYD నగర భవన యజమానులకు పోలీసులు పలు సూచనలు చేశారు. నివాస, వాణిజ్య భవనాలను నగరంలో రెంట్ కోసం ఇచ్చే ముందు యజమానులు నిబంధనలు పాటించాలని, అగ్రిమెంట్ చేసుకోవాలని సైబర్‌క్రైమ్ DCP శిల్పవల్లి తెలిపారు. ఖాళీ చేయించాల్సిన సమయంలో రెంటర్లకు నోటీసులు ఇవ్వాలని, కిరాయి సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకోవాలని సూచించారు.