News August 20, 2025

హిందూపురం వచ్చే.. వందే భారత్ రైలు ఆగే!

image

యశ్వంతపూర్ నుంచి కాచిగూడ వెళ్లే వందే భారత్ రైలు హిందూపురంలో ఆగేందుకు రైల్వే ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రైలు ఇంతకు ముందు యశ్వంతపూర్ నుంచి ధర్మవరం మీదుగా కాచిగూడ వెళ్లేది. హిందూపురం ప్రజల కోరిక మేరకు ఎంపీ బీకే పార్థసారది రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నను కలిసి హిందూపురంలో రైలు ఆగేందుకు అనుమతివ్వాలని కోరారు. దీంతో ఇక నుంచి వందే భారత్ రైలు హిందూపురంలో ఆగుతుందని అధికారులు వెల్లడించారు.

Similar News

News March 4, 2026

ఏలూరు: ఇంటర్ పరీక్షలకు 343 మంది గైర్హాజరు

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం 56 సెంటర్లలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర పరీక్షలు నిర్వహించారు. మ్యాథ్స్ ఏ, సివిక్స్ పరీక్షలకు 12,710 మంది విద్యార్థులు హాజరయ్యారు. 343 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద మాస్ కాఫీయింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

News March 4, 2026

పెండింగ్ చలాన్లు మొత్తం కట్టాల్సిందే: వరంగల్ సీపీ

image

పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. వాహనదారులు తమ వాహనంపై ఉన్న ట్రాఫిక్ జరిమానాలు పూర్తిగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. పెండింగ్ ట్రాఫిక్ జరిమానాలపై ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి రాయితీ ప్రకటించలేదని వాహనదారులకు సూచించారు.

News March 4, 2026

నాగర్‌కర్నూల్‌లో హోలీ విషాదం.. యువకుడి మృతి!

image

హోలీ పండుగ వేళ అమ్రాబాద్ మండలం మన్ననూరులో విషాదం నెలకొంది. ఓ హోటల్‌లో కొబ్బరికాయలు కోసేందుకు చెట్టు ఎక్కిన కాళీ అనే యువకుడు ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై హనుమంత రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.