News August 20, 2025
HYD: నేడు ట్రంపెట్ జంక్షన్‌ను ప్రారంభించనున్న సీఎం

కోకాపేటలో HMDA ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన నియోపొలిస్ లేఅవుట్‌ను ORRతో అనుసంధానమయ్యే రహదారి (ట్రంపెట్) సిద్ధమైంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు. ఈ లేఅవుట్ నుంచి నేరుగా ఔటర్‌పైకి రాకపోకలు సాగించొచ్చు. దీంతో నియోపోలీస్ నుంచి 20 నిమిషాల్లోనే విమానాశ్రయానికి చేరుకొవచ్చు.
Similar News
News March 11, 2026
నిర్మల్: మైనారిటీ యువతకు ఉచిత శిక్షణ

నిర్మల్ జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనారిటీ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రారంభం కానుందని జిల్లా సంక్షేమ అధికారి ఆర్.మోహన్ సింగ్ తెలిపారు. యువతకు ఉపాధి, స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యమని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 12, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
News March 11, 2026
నెక్లెస్ రోడ్ నీరా కేఫ్ భవనం లీజుకు టెండర్ల ఆహ్వానం

నెక్లెస్ రోడ్ వద్ద ఉన్న నీరా కేఫ్ భవనాన్ని లీజుకు ఇవ్వడానికి తెలంగాణ TD టాపర్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ టెండర్లను ఆహ్వానించింది. ఈ భవనంలో నీరా ప్రాసెసింగ్ యూనిట్, బ్యాంకెట్ హాల్‌తో పాటు 7 వాణిజ్య దుకాణాలు ఉన్నట్లు మేడ్చల్ జిల్లా BC అభివృద్ధి శాఖ అధికారి ఝాన్సీరాణి తెలిపారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో గౌడ వృత్తికి చెందిన సంఘాల నుంచి నిర్దిష్ట నిబంధనలు, మేరకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు.
News March 11, 2026
బుచ్చి: ఐదు పెళ్లిళ్లతో మోసం..!

నెల్లూరు జిల్లా బుచ్చి మండలం వవ్వేరుకు చెందిన గోళ్ల బెనర్జీ ఉద్యోగాల పేరుతో <<19350944>>మోసం <<>>చేస్తూ శ్రీకాకుళం పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ఇతను చదివింది ఇంటర్ మాత్రమే. CAనంటూ చాలామందిని మోసం చేశాడు. పంచేడు, గూడూరు, ఆత్మకూరుతో పాటు రాజమండ్రిలో ఇద్దరిని పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. మొత్తంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుని నిరుద్యోగులతో పాటు మహిళలను సైతం మోసం చేశాడని తెలుస్తోంది.


